టాలీవుడ్ నటుడు పవన్‌కళ్యాణ్ పింక్ తెలుగు రీమేక్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన సినిమా షూటింగ్ మళ్లీ షురూ అయింది.ఈ మూవీ చివరి షెడ్యూల్ షూట్ లో నివేదా థామస్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఫొటో ద్వారా తెలియజేస్తూ..మళ్లీ షూటింగ్ కు తిరిగి రావడం ఆనందంగా ఉందని నివేదా ట్వీట్ చేసింది. బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు మగువా మగువా అంటూ వచ్చే పాటకు ప్రేక్షకు ల నుంచి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.
పవన లోకేషన్‌కి జేరిన నివేధా
Related tags :