గుడిలో దేవుడికి పూజలు చేసేటప్పుడు కలిగే అనుభూతే వేరు. అయితే.. దేవుడికి జరిగే అన్నీ సేవలూ మనకళ్లముందే జరుగుతాయి.. నివేదన సమయంలో మాత్రం పరదా వేస్తుంటారు ఎందుకంటే..దేవదేవుడికి ఉదయం లేచింది మొదలు సుప్రభాత సేవతో పాటు ఎన్నో సేవలు చేస్తుంటారు. వీటన్నింటిని మనం చూస్తూనే ఉంటాం. కానీ, అర్చనలలో జరిగే షోడశ ఉపచారాలలో ఒకటైన నివేదన సమయంలో మాత్రం పరదా వేస్తుంటారు. అందుకు కారణం.. దృష్టి దోషం కలగకుండా ఉండడమేనని ఆగమ సంప్రదాయం చెబుతోంది. దేవునికి నివేదన చేసిన పదార్థం ప్రసాదం అవుతుంది. ఆ సమయంలో దేవుడిని చూడకుండా పరదా వేస్తుంటారు.మన ఇళ్లల్లో చిన్నపిల్లలు సమయంలో కూడా ఇలానే చేస్తారు పెద్దలు.దృష్టి దోషాన్ని అరికట్టేందుకు తెరకట్టాలని ఆగమ సంప్రదాయం.
నైవేద్యం పెట్టాక పరదా ఎందుకు కప్పుతారు?
Related tags :