ScienceAndTech

మహిళలను ఆన్‌లైన్‌లో కూడా వదలట్లేదు

మహిళలను ఆన్‌లైన్‌లో కూడా వదలట్లేదు

ఆన్‌లైన్ వేధింపులు, దుర్వినియోగాలకు భారీ లక్షాల్లో బాలికలు, యువతులు ఒక లక్షంగా ఉంటున్నారని 22 దేశాల్లో చేపట్టిన తాజా ప్రపంచ స్థాయి సర్వే వెల్లడించింది. ‘స్టేట్ ఆఫ్ ది వరల్డ్ గర్ల్ రిపోర్టు’ పేరున బ్రిటన్‌కు చెందిన హ్యూమనిటేరియన్ ఆర్గనైజేషన్ ప్లాన్ ఇంటర్నేషనల్ ఏప్రిల్ 1 నుంచి మే 5 వరకు నిర్వహించిన ఈ సర్వేలో 22 దేశాలకు చెందిన 1525 ఏళ్ల లోపు యువతులు పాలుపంచుకున్నారు. భారత్‌తో సహా బ్రెజిల్, నైజీరియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, థాయ్‌లాండ్, అమెరికా దేశాల్లో ఈ సర్వే చేపట్టారు. ఈనెల 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ సర్వేలో పాల్గొన్నవారు 58 శాతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్, తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా ఆన్‌లైన్ వేధింపులకు, దుర్వినియోగానికి గురయ్యామని అంగీకరించారు. ప్రపంచం మొత్తం మీద ఈ విధంగా బాధితులైన మహిళల శాతం వివిధ రీజియన్ల లో ఒకేలా ఉండడం విశేషం. ఐరోపాలో 63 శాతం, లాటిన్ అమెరికాలో 60 శాతం, ఆసియా పసిఫిక్ రీజియన్‌లో 58 శాతం, ఆఫ్రికాలో 54 శాతం,ఉత్తర అమెరికాలో 52 శాతం, బాలికలు వేధింపులకు గురయ్యారని నివేదిక వివరించింది. ఈ వేధింపులు లైంగిక బెదిరింపులనుంచి జాత్యహంకార వ్యాఖ్యలు, కొట్టడాల వరకు మొత్తం వేధింపు వివిధ రూపాల్లో యువతులపై జరిగినట్టు నివేదిక వివరించింది. వేధింపులకు గురైన బాలికల్లో 47 శాతం మందికి భౌతికంగా, లైంగికంగా వేధింపు జరగ్గా, 59శాతం మంది కి దుర్వినియోగం, అవమానకర భాషతో ఆన్‌లైన్‌లో వేధింపులు జరిగినట్టు తేలింది. మైనార్టీ, ఎల్‌జిబిటి(గే కమ్యూనిటీ) కమ్యూనిటీకి చెందినవారే అధికశాతం వేధింపులకు గురయ్యారు. బాలికల్లో వేధింపులకు గురైన వారి లో 42 శాతం ఎల్‌జిబిటిఐక్యూ కమ్యూనిటీవారే. 14 శాతం దివ్యాంగులు కాగా, 37శాతం మంది మైనార్టీ జాతుల వారు. సోషల్ మీడియాలో వీరంతా అనామికం గా ఉన్నప్పటికీ తమను ఎవరు వేధించే వారెవరో బాలిక లు, యువతులు కొంతవరకు తెలుసుకోగలిగారు. తమకు తెలిసిన వారి కన్నా తెలియని వారి నుంచే వీరు తరచుగా విపరీతంగా వేధింపులకు గురయ్యారు. బాలికల్లో 11 శాతం మంది ప్రస్తుత,లేదా మాజీ సన్నిహిత భాగస్వాముల నుంచి, 21 శాతం మంది స్నేహితులు,23 శాతం మంది తమ స్కూలు, లేదా పనిలోని వారి వల్లనే వేధింపులకు గురైనట్టు తెలుసుకోగలిగారు. అనామిక సోషల్ మీడి యా ద్వారా అపరిచితుల నుంచి తాము వేధింపులకు గురయ్యామని 36 శాతం మంది బాధితులు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా వేధింపుల ప్రభావం సోషల్ మీడియా బయట కూడా వారి జీవితంపై ప్రభావం చూపింది. ఆన్‌లైన్ వేధింపుల ఫలితంగా 42 శాతం మంది మానసికంగా, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అదేశాతం మంది ఆత్మాభిమానాన్ని నమ్మకాన్ని కోల్పోయారు. ఈ వేధింపుల కారణం గానే ఐదుగురు బాలికల్లో ఒకరు (19 శాతం) సోషల్ మీడియా వేదికలను వినియోగించడం తగ్గించారు. మరో పది మందిలో ఒకరు వంతున (12 శాతం) తమ మార్గా న్ని తమంతట తాము మార్చుకున్నట్టు వెల్లడించారు. వేధింపుల విషస్థాయితో బాలికలు మౌనం దాల్చవలసి వస్తోంది. లింగ సమానత, ఎల్‌జిబిటి సమస్యలపై పోరా టం సాగించే క్రియాశీల కార్యకర్తలు ముఖ్యంగా తరచుగా వేధింపులకు గురి అవుతున్నారు. వారి జీవితాలు, కుటుంబాలు బెదిరింపులు ఎదుర్కొంటున్నాయని ప్లాన్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నెబిర్గెట్టె అల్బ్రెక్టెసెన్ వెల్లడించారు. ఆన్‌లైన్ వేదికల నుంచి బాలికలను బయటకు నెట్టివేయడం పెరుగుతున్న డిజిటల్ ప్రపంచం నుంచి భారీగా వారి సాధికారతను నిర్వీర్యం చేయడమేకాక, నాయకులుగా కావలసిన వారి సామర్థానికి నష్టం కలిగించడమే అవుతుందని అభిప్రాయ పడ్డారు.