మొలల (పైల్స్) బాధ అంతా ఇంతా కాదు. మల విసర్జన సమయంలో రక్తం చుక్కలుగా పడటం.. మలద్వారం వద్ద నొప్పి, మంట తీవ్రంగా వేధిస్తాయి. మొలలకు ప్రధాన కారణాలు మల బద్ధకం, విసర్జన సమయంలో ముక్కటం. రోజుకు కనీసం 6-8 గ్లాసుల నీళ్లు తాగటం ద్వారా విసర్జన సాఫీగా సాగేలా చూసుకోవచ్ఛు అంతేకాదు, కొన్ని పండ్లూ ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఎండు అంజీరా. రాత్రిపూట రెండు, వడు పండ్లను శుభ్రంగా కడిగి గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున పండ్లను తిని, ఆ నీటిని తాగాలి. వీలైతే సాయంత్రం కూడా ఇలాగే చేయొచ్ఛు ఇలా 3-4 వారాల పాటు చేస్తే మంచి గుణం కనిపిస్తుంది. అంజీరా పండ్లలోని సన్నటి గింజలు పేగుల కదలికలు మెరుగుపడటానికి దోహదం చేస్తాయి. దీంతో విసర్జన సాఫీగా అవుతుంది. పేగులు ఎప్పటికప్పుడు శుభ్రమవుతాయి. మల ద్వారం మీద ఒత్తిడి పడటం తగ్గుతుంది. మొలలు సైతం కుంచించుకుపోవటం మొదలెడతాయి. రక్తస్రావంతో బాధపెట్టే మొలలకు మామిడి టెంకలోని విత్తనాలూ ఉపయోగపడతాయి. మామిడి పండ్ల కాలంలో వీటిని సేకరించి, నీడలో ఎండించి, పొడి చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని 1.5 నుంచి 2 గ్రాముల మోతాదుతో తేనేతో కలిపి తీసుకోవచ్ఛు తేనే లేకపోతే విడిగానైనా తీసుకోవచ్ఛు అలాగే నేరేడు పండ్లూ మొలల బాధ ఉపశమనానికి తోడ్పడతాయి. వీటిని ఉదయాన్నే ఉప్పుతో పాటు తీసుకుంటే మంచిది. నేరేడు పండ్లు కాసే ప్రతి కాలంలోనూ వీటిని క్రమం తప్పకుండా తింటున్నట్టయితే దీర్ఘకాలం పాటు మొలల బాధ నుంచి తప్పించుకునే అవకాశముంది.
మలబద్ధకానికి విరుగుడు ఎండు అంజీర
Related tags :