తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలను తితిదే ప్రకటించింది. ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలో భక్తులను వాహనసేవలకు అనుమతించనున్నారు. శ్రీవారి దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించి ఆలయంలో మూలమూర్తి దర్శనంతో పాటు తిరువీధుల్లో వాహన సేవల దర్శనం కల్పించనున్నారు.
*తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. గత నెలలో నిర్వహించిన వార్షిక ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలో నిర్వహించిన తితిదే… నవరాత్రి ఉత్సవాలను తిరువీధుల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా పరిమిత సంఖ్యలో భక్తులను వాహనసేవలకు అనుమతించనున్నారు. ఉదయం వాహన సేవలు 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవలు 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. శ్రీవారి దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించి ఆలయంలో మూలమూర్తి దర్శనంతో పాటు తిరువీధుల్లో వాహన సేవల దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు వాహన సేవల వివరాలను తితిదే ప్రకటించింది.
15.10.2020 – గురువారం- అంకురార్పణ- రాత్రి 7 నుంచి 8 గంటల వరకు.
16.10.2020 – శుక్రవారం – బంగారు తిరుచ్చి ఉత్సవం- ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, పెద్దశేష వాహనం- రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.
17.10.2020 – శనివారం – చిన్నశేష వాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు, హంస వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
18.10.2020 – ఆదివారం – సింహవాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు, ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.
19.10.2020 – సోమవారం – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు, సర్వభూపాల వాహనం – రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.
20.10.2020 – మంగళవారం – మోహినీ అవతారం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు, గరుడసేవ – రాత్రి 7 నుంచి 12 గంటల వరకు.
21.10.2020 – బుధవారం – హనుమంత వాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు, పుష్పక విమానం- సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు, గజ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
22.10.2020 – గురువారం – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు, చంద్రప్రభ వాహనం – రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.
23.10.2020 – శుక్రవారం – స్వర్ణ రథోత్సవం- ఉదయం 8 గంటలకు, అశ్వ వాహనం – రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.
24.10.2020 – శనివారం – పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం – ఉదయం 3 నుంచి 5 గంటల వరకు, స్నపనతిరుమంజనం, చక్రస్నానం – ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, బంగారు తిరుచ్చి ఉత్సవం – రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.