‘‘ఈ సృష్టిలో ప్రతి వస్తువుకీ ఓ విలువ ఉంటుంది. ఆఖరికి పరాజయం సైతం మనకేదో నేర్పుతుందంటోంది పూజా హెగ్డే. వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజ.. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బిజీగా ఉంది. మరోవైపు ప్రభాస్ చిత్రంలోనూ నటిస్తోంది. పూజ మాట్లాడుతూ ‘‘నా కెరీర్ ప్రారంభంలోనే అన్ని రకాల అనుభవాల్నీ చూసేశాను. ఫ్లాపులొచ్చాయి. విజయాలు వరించాయి. కథానాయికగా పలు పార్శ్వాలున్న పాత్రలు దక్కాయి. ఇవన్నీ నాకు మంచి అనుభవాలు. ప్రతి సినిమా నాకు ఎంతో కొంత నేర్పింది. ‘మొహంజదారో’ లాంటి పరాజయం నుంచి కూడా ఎక్కువ విషయాలు తెలుసుకోగలిగాను. ఎవరు చెప్పగలరు.. పదేళ్ల తరవాత ఆ అనుభవాలే నాకు గొప్పగా కనిపిస్తాయేమో? జీవితంలోని ప్రతి దశనీ పరిపూర్ణంగా అనుభవించాలనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆనందంగా ఆహ్వానించాలని భావిస్తున్నాను. అందుకే ప్రతి గంటనీ ఆస్వాదిస్తున్నాను’’ అంది.
ప్రతిదాన్ని ఆస్వాదిస్తున్నాను
Related tags :