నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన పాత్రలకు తాను ప్రాధాన్యమిస్తానని చెబుతోంది ఢిల్లీ భామ శ్రియ. తెలుగులో అగ్రనాయికల్లో ఒకరిగా పేరుతెచ్చుకుంది ఈ సుందరి. కెరీర్ తొలినాళ్లలోగ్లామర్‌తళుకులతో ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది. గత కొంతకాలంగా ప్రయోగాలకు ప్రాముఖ్యతనిస్తోన్న ఆమె డీ గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధమంటోంది. తాజా చిత్రం ‘గమనం’లో మూగ యువతిగా చాలెంజింగ్ పాత్రలో శ్రియ కనిపించబోతున్నది. ఆమె మాట్లాడుతూ‘కమర్షియల్ సినిమాలతో పోలిస్తే అభినయానికి ప్రాముఖ్యమున్న పాత్రలు ఎక్కువ కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. నటులకు అలాంటి పాత్రల్లోనే ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది. అలాంటి మంచి కథల కోసం నేను ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం మహిళా ప్రధాన చిత్రాలకు ఆదరణ పెరిగింది. కథానాయికల్లోని ప్రతిభాసామర్థ్యాల్ని చాటిచెప్పేలా గొప్ప కథలు వెండితెరపై ఆవిష్కృతమవుతున్నాయి. నటిగా నాలోని కొత్త కోణాల్ని ఆవిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నా. ఆ ఆలోచనతోనే రొటీన్ పాత్రలకు దూరంగా ఉంటా.
నాకు రొటీన్ వద్దు
Related tags :