Food

వెల్లుల్లి తప్పక తీసుకుంటున్నారా?

వెల్లుల్లి తప్పక తీసుకుంటున్నారా?

ఉల్లి మాత్రమేనా? వెల్లుల్లి సైతం ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అలిసిన్‌ అనే ప్రత్యేకమైన నూనె ఉంటుంది. వెల్లుల్లికి ఒక రకమైన గంధకపు వాసన, రుచిని తెచ్చిపెట్టేది ఇదే. అలిసిన్‌కు బ్యాక్టీరియాను చంపే గుణముంది. ఇదొక్కటే కాదు.. ఆర్జినైన్‌, ఒలిగోశాక్రైడ్లు, రుచిద్రవ్యాలు, సెలీనియంలాంటి 40కి పైగా ఆరోగ్యకరమైన పదార్థాలు వెల్లుల్లి సొంతం. ఇది రక్తనాళాలు విప్పారేలా, సాగేలా చేస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ స్థాయులనూ తగ్గిస్తుంది. రక్తం గడ్డలు ఏర్పడకుండా, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండానూ కాపాడుతుంది. ఇలా పక్షవాతం ముప్పు తగ్గేలా చేస్తుంది. కాబట్టి దీన్ని అనుబంధ చికిత్సగా తీసుకోవచ్చన్నది నిపుణుల భావన. మధుమేహుల్లో గ్లూకోజు మోతాదులు తగ్గటానికీ వెల్లుల్లి సాయపడుతుంది. దీన్ని ఎక్కువగా తీసుకునేవారిలో కొన్ని రకాల క్యాన్సర్లూ తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొవిడ్‌-19 విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంతకన్నా చేసే మేలు ఇంకేముంటుంది?