కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెరియనంబి సహా 12 మంది ఆలయ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 15 వరకు ఆలయం మూసే ఉంటుందని పాలకమండలి వెల్లడించింది. అయితే, భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండదని, తక్కువ మంది సిబ్బందితో ఆలయంలో రోజువారి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.అయితే, ఆలయ ప్రధాన అర్చకుడు పెరియనంబి ఆలయానాకి వచ్చేవరకు పూజా బాధ్యతలు చూసుకునేందుకు తంత్రి సరననెళ్లూర్ సతీషన్ నంబూతిరిప్పడు తిరువనంతపురం చేరుకున్నాడు. కాగా కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 21 నుంచి కేరళ పద్మనాభస్వామి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఆలయాలు తెరిచేందుకు అవకాశం ఇవ్వడంతో గత ఆగస్టు 27న ఆలయాన్ని తెరిచారు. ఇప్పుడు సిబ్బందికి కరోనా సోకడంతో తాత్కాలికంగా మూసివేశారు.
పద్మనాభుని ఆలయం 15వరకు మూసివేత
Related tags :