కరోనా సోకి స్వల్ప స్థాయిలో అనారోగ్యానికి గురైనప్పటికీ లక్షణాలు మాత్రం నెలల తరబడి ఉంటున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. మరికొంత మందిలో రోజులు గడుస్తున్న కొద్దీ అనారోగ్యం మరింత తీవ్రమవుతోందని తెలిపింది. ఈ మేరకు ఫ్రాన్స్‌లో మార్చి నుంచి జూన్ మధ్యలో జరిపిన ఓ అధ్యయనాన్ని ‘క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్’ జర్నల్‌లో ప్రచురితమైంది. స్వల్ప నుంచి మోస్తరు స్థాయి లక్షణాలున్న 150 మంది కొవిడ్ బాధితులపై ఈ అధ్యయనం జరిపారు. వీరిలో 66.66శాతం మందిలో కరోనా నిర్ధారణ అయిన 60 రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గలేదు
కరోనా తగ్గాక లక్షణాలు మూడునెలల పాటు ఉంటాయి
Related tags :