అర్ధనారీశ్వరుడిగా శివయ్య పూజలందుకుంటాడని తెలిసిన విషయమే. ఒక పక్క పురుషుడిగా, మరోపక్క స్త్రీగా నీరాజనాలు అందుకుంటుంటాడు. ఇది మన పురాణ కథనం. కానీ ఇలాంటి రూపాన్ని పక్షుల్లోనూ ఉంటుందని చెబుతున్నారు అమెరికా పరిశోధకులు. పౌడర్ మిల్ నేచర్ రిజర్వ్ సెంటర్‌లో ఉభయలింగజీవిని పరిశోధకులు కనుగొన్నారు. సెప్టెంబర్ 24న ఓ పరిశోధకురాలి కంటపడగా.. ఆమె తన టీమ్‌కు కబురందించింది. వెంటనే వారు అక్కడికి చేరుకుని ఆ పక్షిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు. వక్షస్థలంలో గులాబీ రంగుతో ఉన్న ఈ పికిలిపిట్ట(గిజిగాడు) పరిశోధకులను అబ్బురపరుస్తోంది. దీని శాస్త్రీయ నామం ఫియోటికస్ లూడోవిసియానస్(Pheucticus ludovicianus). కుడివైపున పురుష రూపం, ఎడమవైపున స్త్రీ రూపం ఉండటంతో అరుదైన పక్షి జాతి అంటూ పరిశోధనలు మొదలుపెట్టేశారు. ఇలాంటి పక్షులు అరుదుగా ఉంటాయని పౌడర్ మిల్ పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి పక్షులను తాము 15 ఏళ్ల క్రితం చూశామని తెలిపారు. అండం అసాధరణ ఫలదీకరణం కారణంగా ఆడ, మగ పక్షిగా జన్మించి ఉంటుందంని చెబుతున్నారు. అయితే ఇలా పుట్టినవి స్త్రీలా ప్రవర్తిస్తాయి.. పురుషుడిలా ప్రవర్తిస్తాయా అన్నదానిపై స్పష్టత లేదని చెబుతున్నారు. పునరుత్పత్తి కూడా ఉంటుందా.. ఉండదా అనే దానిపై పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. అయితే ఆ పరిధోనలు కూడా కష్టమేనని.. ఇవి అరుదుగా కనిపించడమే దానికి కారణమని అంటున్నారు. 64 ఏళ్ల పౌడర్ మిల్ రీసెర్చ్ సెంటర్ చరిత్రలో సుమారు 10 వరకు వీటిని గుర్తించామని పరిశోధకులు చెబుతున్నారు.
అమెరికాలో అర్ధనారీశ్వర పక్షి
Related tags :