‘యాక్షన్’ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు కథానాయకుడు విశాల్ డబ్బులు చెల్లించాలని మద్రాస్ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. విశాల్, తమన్నా జంటగా.. సుందర్.సి దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఫుల్‌టైమ్ యాక్షన్ చిత్రం ‘యాక్షన్’. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకొంది. అయితే, ఈ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్‌లో నిర్మించాలని చిత్ర నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ తొలుత భావించినప్పటికీ… ‘సినిమా కనీసం రూ.20 కోట్లు వసూలు చేయకపోతే ఆ నష్టాన్ని నేను భరిస్తా’ అని విశాల్ ఇచ్చిన మాట మేరకు రూ.44 కోట్లతో ‘యాక్షన్’ను నిర్మించారు.
విశాల్‌కు హైకొర్టు షాక్
Related tags :