సింగపూర్ తెలుగు సమాజం, ఈ ఏడాదిలోనే రెండో సారి అక్టోబర్ 11 న స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించింది. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మొత్తం 120 మంది నమోదు చేసుకోగా 100 మంది హాజరయ్యారయి రక్తదానం చేశారు.
సింగపుర్ ప్రవాసుల రక్తదానం
Related tags :