1. సన్ ఫ్లవర్ గింజలు అనేక రకాల రేట్లు, అనేక రకాల క్వాలిటీ లతో లభిస్తాయి. గింజల క్వాలిటీ, రేటు ను బట్టి ఆయిల్ ఈల్డింగ్ ఉంటుంది.
2. ఇండియా లో పండే పొట్టు తీయని గింజలు (బాగా మట్టితో ఉంటుంది) ఒక కిలో రు.50 కు దొరుకుతాయి. 100 కిలోల గింజలు (రు.5,000) కోల్డ్ ప్రెస్ లో గానుగ ఆడిస్తే మాక్జిమం 22 కిలోల ఆయిల్ (ఆయిల్ తో వచ్చే మలినాలను పూర్తిగా తొలగించాక) వస్తుంది.
3. 100 కిలోల గింజలు ఆడిస్తే షుమారు 65 కిలోల వేస్ట్ చక్క రెసిడ్యూయల్ గా వస్తుంది. సన్ ఫ్లవర్ చక్క కు మార్కెట్ లో అంత డిమాండ్, రేటు లేదు. ఒక కిలో షుమారు రు.8 to 10 కు మించి కొనరు. అదే కొబ్బరి లేదా నువ్వుల వేస్ట్ చక్క కు రు.30 వరకు రేటు వస్తుంది.
4. ఇప్పుడు మిల్లు వ్యాపారికి పడిన ఖరీదు లెక్కపెడదాం.
100 కిలోల గింజలు @ రు.50= రు.5,000 తో కొన్నాడు.
65 కిలోల చక్క @ రు.10 కు అమ్మగా= రు.650 ఆదాయం.
అంటే 5,000 నుండి 650 తీసేస్తే 4,350 రూపాయలకు 22 కిలోల నూనె వచ్చింది.
అంటే ఒక కిలో నూనె ఖరీదు మిల్లు వాడికి (4,350/22) రు.198 పడుతుంది ఇతర ఖర్చులు కాకుండా.
5. ఆయిల్ తీయటానికి మిషన్, లేబర్, కరెంటు, తదితరాలు వేసుకొంటే హీనపక్షం రు.650 కలపాలి. అంటే 22 కిలోలకు రు.5,000 అంటే కిలో 227 రూపాయలు పడుతుంది కొంచెం అటు ఇటుగా.
6. నేను చెప్పింది ఒక మిల్లు వాడికి పడిన అసలు ఖరీదు మాత్రమే. దీనికి
తయారిదారు లాభం+ ప్రింటెడ్ పాకింగ్+అమెజాన్ కమిషన్ (లేదా హోల్ సేల్ మరియు రిటైలరు లాభం)+టాక్సులు+డబుల్ రిఫైండ్ ఖర్చు+ప్రకటనలు+కంపెనీ ఓవర్ హెడ్ లు+ట్రాన్సుపోర్టు లాంటివి ఆ రు.227 కు కలిపితే ఎంత రేటు వినియోగదారుడికి పడుతుందో మీరే లెక్క వేసుకోండి.
7. నేను పొట్టు తీయని గింజలు రు.50 అతి తక్కువ ఖరీదులో దొరికే వాటి లెక్క ఇప్పటివరకు చెప్పాను. ఇక పొట్టు తీసిన మంచి క్వాలిటీ గింజలు చైనావి రు.125 పడుతుంది. వీటికి 30-35% ఈల్డింగ్ వస్తుంది. అలాగే విదేశాల నుంచి దిగుమతి అయ్యే గింజలు రు.400 రేంజ్ లో దొరికే వాటికి ఈల్డింగ్ 40% వరకు ఉంటుంది.
8. మనం వీటిని నికరంగా లెక్కపెట్టినప్పటికి మొదట చెప్పిన ఖరీదు కంటే ఎంతో ఎక్కువే పడుతుంది తప్ప తగ్గదు. అమెజాన్ లో అమ్మే విదేశీ క్వాలిటీ రు.400 గింజలకు ఈల్డింగ్ 40% కాదు సరదాగా 200% ఈల్డింగ్ వేసుకున్నా (అంటే కిలో గింజలకు రెండు కిలోల ఆయిల్) ఆ MRP 95 to 100 పడదు గాక పడదు. నేను చెప్పిన లెక్కలకు అటు ఇటు వేసుకున్నా సరే లెక్క మారదు.
9. మరి ఇప్పుడు చెప్పండి సన్ ఫ్లవర్ డబుల్ రిఫైండ్ ఆయిల్స్ అమ్మే వారు రు.95 to 100 mrp కు ఎలా అమ్ముతున్నారో..!! నిజానికి దీని నుంచి అందరి లాభాలు, అమెజాన్ కమిషన్ లు ( అమెజాన్ లో ఒక లీటరు ఆయిల్ పాకెట్ రు.500 కు అమ్మితే రు.150 ఫ్లాట్ ఫారం ఛార్జ్ కట్టాలి ), టాక్సులు, ఖర్చులు తీసివేస్తే తయారిదారుకు ఆయిలు ఖరీదు ఎంత తక్కువ పడుతుందో మీరే గ్రహించండి. పైన చెప్పినవి కలపకుండా ఒక మిల్లు వాడి ఉత్పత్తి ఖరీదు రు.227 అయ్యింది. మన బ్రాండు గాళ్ళ అన్నీ కలిపిన MRP అంతకంటే ఎంతో తక్కువ. అలా అంత తక్కువ రేటుకు ఎలా అమ్ముతున్నారో వారు చెప్తున్నప్పుడు మన చెవుల్లో సన్ ఫ్లవర్లు పెట్టుకోవటం మరవకండి ..
10. ఇది సన్ ఫ్లవర్ గురించి చెప్పినప్పటికీ ఇతర రిఫైండ్ ఆయిల్స్ బాగోతం ఇంచుమించుగా ఇలానే ఉంటుంది. దశాబ్దాలుగా మన వైద్య ప్రపంచం ఈ రిఫైండ్ ఆయిల్స్ వాడకపోతేనే గుండెపోటు తో ఛస్తారు అని బెదరగొట్టి మరీ మనచేత వాడించారు. ఇప్పడు తూచ్ చెప్పేశారులెండి.. ఒకప్పుడు చక్క గానుగల నుంచీ గింజలు పట్టుకెళ్ళి ఆయిల్ తెచ్చుకున్న స్వర్ణయుగంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నామో, ఈ దిక్కుమాలిన కెమికల్ రిఫైండ్ ఆయిల్స్ వచ్చాక సమాజం అనేక రోగాల పాలిట ఎలా పడిందో 50 దాటిన వారిని అడిగితే వివరంగా గుర్తు తెచ్చుకొని మరీ చెప్తారు. ఇప్పటికీ మించిపోలేదు. ఆ రోగకారక రిఫైండ్ ఆయిల్ పాకెట్లు వదిలిపెట్టండి. ఎవరి గింజలు వారు కొనుక్కొని, గానుగల్లో దగ్గరుండి ఆయిల్ ఆడించుకోండి. సాచ్యురేటెడ్ ఫాట్లే మంచివి. చక్కగా నెయ్యి, ఒరిజినల్ కొబ్బరినూనె, గానుగ పల్లీ ఆయిల్, నువ్వుల నూనెలు వాడటం మొదలుపెట్టండి. మన పిల్లలను విక్రుత కెమికల్ ప్రపంచం నుంచి దూరం చేసి ప్రక్రుతి కి దగ్గరగా చేద్దాం. సంపూర్ణ ఆరోగ్య విప్లవ ఉద్యమాన్ని తెలుగు జాతి యావత్తు ముందుండి నడిపిద్దాం..
చివరిగా:
కరీంనగర్ లో కుక్కలు, పందుల కళేబరాలతో ఆయిల్ తీసి అమ్మేవాడికి, అమెజాన్ మరియు సూపర్ బజార్లలో డబుల్ రిఫైండ్ ఆయిల్ అమ్మేవాడికి తేడా ఏమిటి ??