DailyDose

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లా నౌక-తాజావార్తలు

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లా నౌక-తాజావార్తలు

* తెన్నేటి పార్క్ తీరంలో ఒడ్డుకు వచ్చినబంగ్లాదేశ్ కు చెందిన మర్చంట్ వెసల్ నౌక….ఎమ్.వి.మా.‌..గాలితీవ్రత ఎక్కవగా వుండటంతో ప్రతికూల పరిస్ధితుల్లో ఒడ్డుకు చేరుకున్న 80 మీటర్ల పొడవాటి నౌక…అర్ధరాత్రే ఇసుక తిన్నులమధ్య చిక్కుకున్న నౌక….సురక్షితంగా బయటపడ్డ సిబ్బంది…యాంకర్లు రెండూ కోల్పోవడంతో ఏర్పడిన సమస్య…నౌకను చూసేందుకు పెద్ద ఎత్తున తీరానికి చేరుకున్న స్ధానికులు.

* జ‌న‌న‌, మ‌ర‌ణ ద్రువీక‌ర‌ణ రిజిస్ట్రేష‌న్ కోసం ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా స్ప‌ష్టం చేసింది. ఆర్టీఐ కింద వేసిన ఓ ప్ర‌శ్న‌కు ఆర్జీఐ ఈ వివ‌ర‌ణ ఇచ్చింది.ఒక‌వేళ ఎవ‌రైనా ఆధార్‌ను స్వ‌చ్ఛంధ‌గా స‌మ‌ర్పిస్తే,  ఆ డాక్యుమెంట్‌ను డేటాబేస్‌లో స్టోర్ చేయ‌రాదు అని ఆర్జీఐ త‌న స‌ర్క్యూల‌ర్‌లో పేర్కొన్న‌ది.మ‌ర‌ణ ద్రువీక‌ర‌ణ ప‌త్రం రిజిస్ట్రేష‌న్ కోసం ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాలా అని విశాఖ‌కు చెందిన అడ్వ‌కేటు ఎంబీఎస్ అనిల్ కుమార్ ఆర్టీఐ వ‌ద్ద అభ్య‌ర్థ‌న చేశారు.ఆ అభ్య‌ర్థ‌న‌కు బ‌దులిస్తూ.. జ‌న‌న‌, మ‌ర‌ణ ద్రువీక‌ర‌ణ కోసం ఆధార్ నెంబ‌ర్ అవ‌స‌రం లేద‌ని ఆర్జీఐ పేర్కొన్న‌ది. 1969 నాటి రిజిస్ట్రేష‌న్ ఆఫ్ బ‌ర్త్స్ అండ్ డెత్స్‌(ఆర్‌బీడీ) యాక్టు ప్ర‌కారం ప్ర‌స్తుతం జ‌న‌న‌, మ‌ర‌ణ ద్రువీక‌ర‌ణ కోసం రిజిస్ట్రేష‌న్ జ‌రుగుతున్న‌ట్లు ఆర్జీఐ వెల్ల‌డించింది. 

* ఏపీలోని కృష్ణా నది కరకట్ట లోపలవైపు ఉండే నివాసాలకు మరోసారి అధికారులు నోటీసులిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి మరోసారి నోటీసులు పంపారు. చంద్రబాబు ఇంటితో సహా మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానదికి వరద ప్రవాహం చేరుకుంది.

* గుడివాడ – మచిలీపట్నం విద్యుత్ రైల్వే డబ్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్.

* ఏపీ సీఎంపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంలో న్యాయవాది పిటిషన్సుప్రీంకోర్టు న్యాయమూర్తితోపాటు హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదును బహిరంగంగా విడుదల చేయటాన్ని సవాల‌్ చేస్తూ… సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైందిరాష్ట్ర ప్రభుత్వంతోపాటు… సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఈ పిటిషన్‌ను న్యాయవాది సునీల్‌కుమార్‌ సింగ్‌ దాఖలు చేశారు.సీఎం జగన్ అన్ని హద్దులను అతిక్రమించారన్న కుమార్‌ సింగ్‌… ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.న్యాయమూర్తులకు వ్యతిరేకంగా విలేకర్ల సమావేశాలు పెట్టి మాట్లాడటాన్ని నిలువరించాలని… అలా చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ప్రశ్నిస్తూ షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది సునీల్‌కుమార్‌ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

* దసరా నేపథ్యంలో దూరప్రాంతాలకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది.ఈనెల 15 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.లాక్‌డౌన్‌కు ముందు నడిచినట్లే దూరప్రాంతాలకు 2,028 బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.దీనిలో భాగంగా దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు.డిమాండ్‌ మేరకు రిజర్వేషన్‌ చేసుకునే బస్సుల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.రద్దీ మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులపై చర్చలు ఇంకా పూర్తి సఫలం కాకపోవడంతో తెలంగాణకు బస్సులు నడపడం లేదు.ఇరు రాష్ట్రాల చర్చలు కొలిక్కి వచ్చాకే తెలంగాణకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది.

* త్వరలో రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో వరుసగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో పంటనష్టం అంచనా వేస్తున్నామని.. రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు. ఈ ఏడాది అనంతపురం జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదు అయిందన్నారు. ఈ నేపథ్యంలో వేరుశనగ పంట నష్టంపై నిపుణుల కమిటీని అనంతపురం జిల్లాకు పంపుతున్నట్లు చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) సహా నాలుగు చట్టసవరణ బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్టాంపుల చట్టం, జీహెచ్‌ఎంసీ, నాలా చట్టం, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ) చట్టాల్లో సవరణల బిల్లులకు ఆమోదం తెలిపింది. అంతకుముందు భూముల ధర నిర్ధారణకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్లకు 47 ఏ కింద ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్‌ స్టాంపు చట్టానికి సవరణ బిల్లును మంత్రి కేటీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు.

* సీపీఐ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ కన్నుమూశారు. గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మల్లేశ్‌ మృతి పట్ల సీపీఐ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్‌ నేతలు డి.రాజా, నారాయణ.. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో పాటు అజీజ్‌పాషా తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

* కరోనా వ్యాప్తి నియంత్రణలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ మెరుగ్గా పనిచేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులను గుర్తించడంలో మొబైల్‌ అప్లికేషన్ల వంటి డిజిటల్‌ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని టెడ్రోస్‌ అన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఆరోగ్య సేతు యాప్‌ సహా ఇతర దేశాల్లోని హెల్త్‌ యాప్‌ల గురించి ప్రస్తావించారు.

* జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌, ఎల్‌జేపీ అధినేత చిరాగ్‌ పాసవాన్‌ మధ్య విభేదాలు తలెత్తినప్పటికీ రెండూ తనకు మిత్రపక్షాలైన నేపథ్యంలో భాజపా మిన్నకుండిపోయింది. అంతేకాకుండా భవిష్యత్‌లో కాషాయపార్టీతో కలిసి ఎల్‌జేపీ అడుగులేస్తుందన్న వార్తలూ వచ్చాయి. అయితే తాజాగా బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ దీనిపై స్పష్టతనిచ్చారు. ఎల్‌జేపీ తిరిగి ఎన్డీయేతో కలిసే అవకాశమే లేదన్నారు. ‘‘ ఒక వేళ ఎన్డీయే మెజార్టీ సాధిస్తే జేడీయూకు చెందిన నితీశ్‌కుమార్‌నే తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. దీనిపై ఎలాంటి సందేహం లేదు’’ అని సుశీల్‌కుమార్‌ మోదీ అన్నారు.

* హోరాహోరీగా సాగుతున్న టీ20 లీగ్‌లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీలో 29వ మ్యాచ్‌లో హైదరాబాద్‌×చెన్నై జట్లు నేడు తలపడనున్నాయి. వరుస ఓటములతో అతి కష్టంగా నెట్టుకొస్తున్న చెన్నై ఓ వైపు.. పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న హైదరాబాద్‌ మరోవైపు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. కాగా.. లీగ్‌ దశను దాటాలంటే చెన్నై 7 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి తీరాల్సిందే.

* పంట వ్యర్థాల దహనంతో ఏర్పడుతున్న కాలుష్యం ఒక్క దిల్లీ నగరానికే కాదు.. యావత్‌ ఉత్తర భారతదేశానికే పెద్ద సమస్యగా మారిందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారు. కాలుష్య స్థాయిని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ఎప్పటినుంచో పనిచేస్తోందని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమస్య పరిష్కారంలో కేంద్రం తీరు దురదృష్టకరమన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం ఏమీ చేయడంలేదని, ఏడాదిగా కూర్చుని చూస్తోందని ఆరోపించారు.