తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. రానున్న అయిదు రోజుల పాటు తాను క్వారెంటైన్‌లో ఉండనున్నట్లు ఆమె ఇవాళ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ తేలడం వల్ల .. తాను క్వారెంటైన్‌లోకి వెళ్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితను నిన్న ఎమ్మెల్యే సంజయ్ విషెస్ చెప్పేందుకు కలిశారు. తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లోకి వచ్చినవారందరూ హోమ్ ఐసోలేషన్‌తో పాటు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ తన ట్విట్టర్‌లో కోరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్‌లో ఎమ్మెల్యే సంజయ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేతో కాంటాక్ట్‌లోకి రావడం వల్ల తాను అయిదు రోజుల పాటు క్వారెంటైన్ కానున్నట్లు కవిత తెలిపారు. తన ఆఫీసుకు ఎవరూ 5 రోజుల పాటు విజిట్ చేయరాదు అని కవిత తన మద్దతుదారుల్ని కోరారు.
సెల్ఫ్ క్వారంటైన్‌లోకి ఎమ్మెల్సీ కవిత
Related tags :