NRI-NRT

రాక రాక ఇండియా వచ్చాడు…పోలీసులు లోపలేశారు!

రాక రాక ఇండియా వచ్చాడు…పోలీసులు లోపలేశారు!

పద్దెనిమిదేళ్ల కిందట అమెరికా వెళ్లిన ఓ వ్యక్తి ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చి అరెస్టయ్యారు. ఎందుకంటే… అహ్మదాబాద్‌కు చెందిన కీర్తి కుమార్‌ పటేల్‌(61) 2002లో చికాగో వెళ్లారు. ఇన్నేళ్లూ అక్కడే ఉన్న పటేల్‌ గత నెల ఇండియాకు తిరిగొచ్చారు. ఈ వ్యక్తి భారత్‌ నుంచి అమెరికా వెళ్లడానికి ఉపయోగించిన పాస్‌పోర్టు నకిలీదని గుర్తించిన పాస్‌పోర్టు అధికారులు పటేల్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబరు 29న భారత్‌కు వచ్చిన పటేల్‌ నకిలీ పాస్‌పోర్టుతో వెళ్లినట్లు అతనిపై ఎఫ్ఐ‌ఆర్‌ నమోదు చేశారు. తనను అన్యాయంగా అరెస్టు చేశారని పటేల్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనను విడుదల చేయాలని కోరారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పటేల్‌ను అనవసరంగా ఈ నకిలీ పాస్‌పోర్టు కేసులో ఇరికించారని పిటీషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. విచారణ జరిపిన హైకోర్టు పటేల్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. నకిలీ పాస్‌పోర్టు ప్రయాణాల వల్ల ఇతర దేశాల్లో మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వివరించింది.