Movies

గ్రామ సర్పంచ్ డైలాగుల రచన

Rajni To Write His Own Dialogues As Grama Sarpanch

తన స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి, ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో రజనీ ఒక గ్రామ సర్పంచ్‌గా కనిపిస్తారని టాక్‌. ఆయన ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌లకు ఇందులో కొదవ లేదట. ఈ నేపథ్యంలో ఆ పంచ్‌డైలాగ్‌లన్నీ రజనీనే స్వయంగా రాసుకోవాలని నిర్ణయించుకున్నారట. గత కొన్ని వారాలుగా దర్శకుడు శివతో కలిసి ఈ విషయమై చర్చలు కూడా జరిపారని టాక్‌. ప్రస్తుతం నిర్మాతలు ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో సెట్‌ను నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ జాకీ ష్రాఫ్‌ ఇందులో ప్రతినాయకుడి కనిపించనున్నారట.