NRI-NRT

ప్రముఖ నాట్య కళాకారిణి శోభానాయుడు ఇక లేరు

ప్రముఖ నాట్య కళాకారిణి శోభానాయుడు ఇక లేరు

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ డా.శోభా నాయుడు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొద్దిరోజుల నుండి హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. గత కొద్దిరోజుల నుండి ఆమె వెంటిలేటర్‌పై ఉంచుతూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా డా.శోభానాయుడు శిక్షణ ఇచ్చిన శిష్యులు(రాలు) వేలసంఖ్యలో ఉన్నారు. ఈ వార్త విని వారు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆమె భర్త, మాజీ IAS అధికారి సీ.అర్జునరావుకు సంతాప సందేశాలు పంపిస్తున్నారు. వెంపటి చినసత్యం శిష్యురాలిగా శొభానాయుడు కూచిపూడి అకాడమీని స్థాపించి గత 40ఏళ్లుగా కూచిపూడి తరగతుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఆమె ఎన్నో అవార్డులను అందుకున్నారు. శోభానాయుడు మృతికి అధికార భాషా సంఘం అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ మాజీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్, సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ నాట్య కళాకారుడు కె.వి.వి.సత్యనారాయణ తదితరులు సంతాపాన్ని వెలిబుచ్చారు.