పూర్ణ కథానాయికగా నటిస్తున్న ‘బ్యాక్‌డోర్’ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కర్రి బాలాజీ దర్శకుడు. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘అర్హతలు లేకున్నా బ్యాక్‌డోర్ ఎంట్రీ ద్వారా అవకాశాలు సంపాదించుకోవడం ప్రతిరంగంలో సాధారణం అయిపోయింది. అలా ఒక బ్యాక్‌డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. పూర్ణ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. ఆమె పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది’ అని చెప్పారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. చాలా విరామం తర్వాత సవాలుతో కూడిన పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని కథానాయిక పూర్ణ ఆనందం వ్యక్తం చేసింది.
వెనుక నుండి…
Related tags :