అక్కినేని వారు హైదరాబాద్కి మారిన తర్వాత, జరిగిన షూటింగ్లకి ఇక్కడి నుంచే మద్రాసు వెళ్లేవారు. అక్కడ సవేరా హోటల్లో ఉండేవారు. సవేరా యజమాని నాగేశ్వరరావుకు అభిమాని, మిత్రుడు. అందుకే హోటలు గదికి బాగా రాయితీ ఇచ్చేవారు. ఆయన నిర్మాతకీ అంతే. అందువల్ల నిర్మాతకి బాగా కలిసి వచ్చేది. భోజనం అప్పట్లో ఆయనకి జగపతి ఫిల్స్మ్ రాజేంద్రప్రసాద్ ఇంటి నుంచి వెళ్లేది. సఫోలా నూనెతో చేసిన వంటలే తినేవారు. ఆ ఏర్పాటంతా రాజేంద్రప్రసాద్ చేసేవారు. ఉదయం రెండు ఇడ్లీ మాత్రం హోటల్లో తినేవారు. అదీ తన ఖర్చుతో. మిత్రులు వస్తే, కాఫీ టిఫిన్లు తెప్పించినా, ఆ బిల్లు అక్కినేని వారే కట్టేవారు గానీ, నిర్మాత మీదకి నెట్టేవారు కాదు.
అందుకే ఆయన అక్కినేని అయ్యారు

Related tags :