* టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. ఆయన వాహనంపై జనాలు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే వర్షాల కారణంగా నిండిన చెరువుకు పూజ చేసేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం మేడిపల్లికి ఆయన వెళ్లారు.ఈ సందర్భంగా ఆయనను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఫార్మా సిటీ కోసం చేస్తున్న భూసేకరణను వెంటనే ఆపేయాలని వారు డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల కోసం తాము భూములు కోల్పోతుంటే కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ఈ సందర్భంగా స్థానికులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు మంచిరెడ్డి యత్నిస్తుండగా… ఆయన వాహనంపై చెప్పులు, రాళ్లను రైతులు విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
* హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా వరసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఇటీవల బోరబండ, జూబ్లీహిల్స్, రహమత్‌నగర్ ప్రాంతాల్లో పెద్ద శబ్దంతో రెండుసార్లు ఈ ప్రకంపనలు సంభవించగా, తాజాగా గచ్చిబౌలి టీఎన్‌జీఓస్ కాలనీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో మంగళవారం రాత్రి సంభవించాయి. పలుమార్లు కొన్ని క్షణాలపాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
* వివేకా హత్య కేసులో తాజా ఎఫ్ఐఆర్ వెలుగులోకి..ఈ ఏడాది జూలై 9న కేసు నమోదు చేసిన సీబీఐ..కేసులో దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీలీని ప్రత్యేక నేరాల విభాగం మూడవ బ్రాంచికి అప్పగింత..ఐపీసీ సెక్షన్ 302 (హత్యానేరం) అబియోగంతో రీరీజిస్టరైన వివేకా హత్య కేసు..తొలుత వివేకా మృతిని సీఆర్పీసీ 174 సెక్షన్ (మృతికి కారణం తెలియదంటూ) కింద కేసు నమోదు చేసిన పోలీసులు..వివేకా కుమార్తె పిటీషన్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు బాధ్యతలు చేపట్టినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న సీబీఐ..వివేకా కేసు పై దర్యాప్తు అధికారిగా ప్రత్యేక నేరాల విభాగం మూడవ బ్రాంచి డీఎస్పీ దీపక్ గౌర్ నియామకం..ప్రస్తుతం సీబీఐ అధికారులకు కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన విచారణ..త్వరలోనే దర్యాప్తు కొనసాగింపుకు రంగంలోకి కొత్త బృందం..
* పిల్లల ను చంపిన తండ్రి….కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని తండ్రి రవి చేతిలో ఇద్దరు చిన్నారులు ( కవల పిల్లలు) సుదీప్,(5) సుధీర్ (5). హతంబుధవారం రాత్రి పొద్దుపోయాక తన ఇద్దరు కొడుకులను తీసుకెళ్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గొంతు నులిమి చంపి పూడ్చి పెట్టిన వైనం.సమాచారం తెలుసుకున్న స్థానికులు ఫారెస్ట్ లోకి వెళ్లి పూడ్చి పెట్టిన ఇద్దరు చిన్నారులను వెలికి తీసిన గ్రామస్తులు.
* సంచలనం సృష్టించిన వైజాగ్ సింహాచలం శ్రీ అప్పన్న దేవస్థానంలో 550 కిలోల ఇత్తడి కానుకలు చోరీ కేసును నాలుగు రోజుల్లోనే చేదించిన పోలీసులుసింహాచలం దేవస్థానం కల్యాణ మండపంలో బద్రపరిచిన 550 కిలోల ఇత్తడి కానుకలు మాయమైనట్టు గుర్తించిన దేవస్థానం ఏఈవో రామారావు ఈ నెల 10న స్థానిక గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేకంగా దృష్టిసారించి విచారణ చేపట్టారు.
* హిందూపురం పట్టణములో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మహత్య యత్నం.ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ రంగ నాయక్ ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఆయనకు ముగ్గురు అమ్మాయిల సంతానం కాగా పెద్దమ్మాయి కి పెళ్లయింది ఆమె భర్త కూడా కరోనా వైరస్ తో మృతి చెందడం విషాదం.అనంతరం హెడ్ కానిస్టేబుల్ రంగనాయక్ కూడా కరోనాబారిన పడి మృతి చెందడంతో మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది దీప్తి (19) లక్ష్మి (16) అనే అక్కాచెల్లెలు ఇంటిలో ఎవరూ లేని సమయంలో విష పదార్థం సేవించారు.వెంటనే చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలించారుఇదిలావుండగా పురం సిఐ లు బాలమద్దిలేటి, మన్సురుద్దీన్ లు దగ్గరుండి వారి యోగక్షేమాలు చూస్తున్నారు.
* బెజవాడలో మరో దారుణం.ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఉన్మాది.నేరుగా ఇంటికి వెళ్లి కత్తితో దివ్య తేజస్విని మెడపై పొడిచిన స్వామి.తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రికి తరలింపు. ఆ తర్వాత తనను తాను కత్తితో గాయపరచుకున్న నిందితుడు.యువతి పరిస్థితి విషమం కావటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.
* పశ్చిమగోదావరిజిల్లా పెదపాడు గ్రామంలో ఆర్ సి ఎం చర్చ్ హుండీ పగలగొట్టి దొంగతనం చేసిన కేసులో నలుగురు ము ద్దాయిలను అరెస్ట్ చేశామని ఏలూరు డి ఎస్ పి ఓ దిలీప్ కిరణ్ తెలిపారు.ఈ కేసులో సి సి కెమారా ఫుటేజ్ ఆధారంగా . ముద్దాయి లను గుర్తించ గలిగామన్నారు.గురువారం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో డి ఎస్ పి మాట్లాడుతూ జిల్లా ఎస్ పి ఆదేశాలమేరకు ఏలూరు రూరల్ సి ఐ అనసూరి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో పెదపాడు ఎస్ ఐ జ్యోతిబసు ఆయన సిబ్బంది సహాయంతో నలుగురు ముద్దాయి లను అరెస్ట్ చేశామన్నారు.ఈ చోరీలో ఏలూరు కు చెందిన రెడ్డి సాయి అచ్చన్న.గండికోట అంజి.గండికోట నాగమల్లేశ్వరరావు.తిరునగరి మోహన్ సుందర్ పాల్గొన్న ట్టు చెప్పారు.చర్చ్ హుండీ పగలగొట్టి చోరీ చేసిన 1300 రూపాయలు .నగదు ను ముద్దాయి ల నుండి రికవరీ చేశామని చెప్పారు.ఈ సందర్భంగా చర్చ్ చుట్టూ సి సి కెమెరాలు అమర్చి న చర్చ్ ఫాథర్ జాన్ ని డి ఎస్ పి అభినందించారు.
* సూర్యాపేట జిల్లా,పెనపహాడ్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీఎస్,పెనపహాడ్ పోలీసు జాయింట్ రైడ్స్.10.4 లక్షల విలువగల 1.30 క్వింటాల గంజాయి సీజ్.నాలుగురు నిందితుల రిమాండ్.రెండు కార్లు,నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం.జిల్లా పోలీసు కార్యాలయం నందు కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ భాస్కరన్ ఈఫ్శ్.జిల్లా ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ ఈరోజు తెల్లవారుజాము నుండి పెనపహాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో జిల్లా సీసీఎస్ పోలీసులు,పెనపహాడ్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ జాయింట్ రైడ్స్ నందు ఆనంతారం అడ్డరోడ్డు వద్ద అనుమానస్పద కార్లను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా ఒక కారులో 60 కేజీల గంజాయి పొట్లాలు,మరొక కారులో 70 కేజీల గంజాయి పొట్లాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.నలుగురు నింధితులను అదుపులోకి తీసుకోవడం జరిగినది,ఒక కారు డ్రైవర్,మరొక నిందుతుడు అక్కడి నుండి తప్పించుకున్నారు.రెండు కార్లు స్వాధీనం చేసుకుని అందులోని 130 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగినది,నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పెనపహాడ్ ఫ్శ్ నందు క్రైమ్ నంబర్ 193/2020 ప్రకారం నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టన్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు.వీరు వైజాగ్ నుండి తెచ్చి హైదరాబాద్,మహారాష్ట్ర లలో అమ్మడానికి వెళుతున్నారు.వీరు గంజాయిని తరలించడానికి ముఠాగా ఏర్పడి కొరియర్స్ గా పని చేస్తున్నారని అన్నారు.ఇలాంటి వ్యవస్తికృత నేరాల వల్ల సమాజానికి,పౌరులకు చాలా నష్టం జరుగుతుంది.ఇలాంటి నేరాలు పునారావృత్తం కాకుండా చేయడంలో భాగంగా పెనపహాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో 16 మంది అనుమానితులను గుర్తించి వారిపై గత నెలలో సస్పెక్ షీట్స్ నమోదు చేయడం జరిగినదని,యువత చెడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలనే ఉద్యేశ్యంతో కేసుల పాలై జైలుకు వెళుతున్నారన్నారు.యువత ఇలాంటి నేరాలకు పాల్పడకుండా సరైన మార్గంలో కష్టపడి కృషితో ఎదగాలి అని ఎస్పీ అన్నారు.ఈ జాయింట్ రైడ్స్ నందు సీసీఎస్ ఇన్స్పెక్టర్ నిరంజన్, ఎస్ఐ రంజిత్,సిసిఎస్ సిబ్బంది కృష్ణ,నర్సింహారావు,రమేష్,దుర్గాప్రసాద్,గురుస్వామి,శ్రీను,పిఎస్ సిబ్బంది కనకరత్నం జాఫర్ అలీ పాల్గొన్నారు.