ఆహార పదార్థంగానే కాదు, నెయ్యిని ఒక ఔషధంంగా వాడుతూ వస్తోంది మన భారతీయ సమాజం. ఎముకల పటిష్ఠతకూ, జీర్ణక్రియ సజావుగా సాగడానికీ నెయ్యి గొప్పగా తోడ్పడుతుంది. శీతకాలంలో దేహాన్ని వెచ్చగా కూడా ఉంచుతుంది. చర్మకాంతికీ, కేశ పోషణకూ నెయ్యి ఉపయోగపడుతుంది. ఇంకా అనేకానేక ప్రయోజనాలు ఉండడం వల్ల కొందరు వంటకాల్లో నూనెకు ప్రత్యామ్నాయంగా నెయ్యి వాడుతున్నారు. శరీర అవయవాల్లో శక్తిని నింపడంతో పాటు జ్ఞాపకశక్తినీ, మేధస్సునూ పెంచడం ద్వారా నెయ్యి శారీరక, మానసిక శక్తిని పెంచే ఒక టానిక్గా పనిచేస్తోంది. నెయ్యిని కొందరు ఔషధ మూలికా కషాయాలకు సమానంగా పరిగణిస్తారు.మరిగించిన 60 మి.లీటర్ల నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు పసుపు పొడి, అరచెంచా నెయ్యి కలిపి పరగడుపున ఒకసారి, రాత్రి భోజనం తర్వాత ఒక సారి సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.30 మి.లీ. నీటిలో అరచెంచా పసుపు, ఒక టీ స్పూను నెయ్యి వేసి ఆరగిస్తే గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.పొడి చర్మం వాళ్లు నెయ్యితో మర్దన చేసుకుంటే, ఆ పొడితనం పోవడంతో పాటు చర్మం మృదువుగానూ, కాంతివంతంగానూ మారుతుంది.నెయ్యిలోని కొవ్వు కంటికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా రెటీనాను ఇది శక్తివంతంగా మారుస్తుంది.నిరంతరంగా నెయ్యి వాడే వారిలో వీర్యకణాల నాణ్యత, వాటి సంఖ్య పెరుగుతాయి.నోటిలో బొబ్బలు వచ్చిన వారు, ఆయా భాగాల్లో నెయ్యి రాస్తే చాలా త్వరితంగా తగ్గుతాయి.అయితే దేశీయ ఆవు నెయ్యితో మాత్రమే ఈ ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు.
నెయ్యి బాగా తింటే…మేధోసంపత్తి పెరుగుతుంది
Related tags :