Politics

భారత రాజకీయాలను శాసించేది కార్పోరేట్లే

భారత రాజకీయాలను శాసించేది కార్పోరేట్లే

భారత రాజకీయాలపై కార్పొరేట్లు ఎంతగా పట్టు బిగించారో రాజకీయ పార్టీలకు ఆయా సంస్థలు ఇచ్చిన విరాళాలు తెలియజేస్తున్నాయి. ఎన్నికలు జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో రూ.20 వేలకు మించిన విరాళాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ విశ్లేషించగా, అందులో 92% కార్పొరేట్‌ సంస్థల నుంచే వచ్చాయని తేలింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు విరాళాల విషయంలో ప్రధానంగా కార్పొరేట్‌ కంపెనీల మీదే ఆధారపడుతున్నాయి.
**బీజేపీకి 94%, కాంగ్రెస్‌కు 82% విరాళాలు(రూ.20,000+) కార్పొరేట్‌ కంపెనీల నుంచే దక్కాయని తేలింది. కార్పొరేట్‌ సంస్థల నుంచే ఎక్కువ విరాళాలు అందుకున్న పార్టీల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌(97%), ఎన్‌సీపీ(94%) ఉన్నాయి. సీపీఎంకు అందిన విరాళాల్లో కార్పొరేట్‌ సంస్థల వాటా 39 శాతమే. అయితే, మొత్తం కార్పొరేట్‌ విరాళాల సొమ్ములో 80% బీజేపీకే దక్కాయి. మిగతా ఇరవై శాతం సొమ్మును అన్ని పార్టీలూ పంచుకున్నాయి.
*లోక్‌సభ ఎన్నికల సమయంలో కార్పొరేట్‌ సంస్థలు రూ.876.10 కోట్లను వివిధ పార్టీలకు విరాళాలుగా అందించగా, అందులో రూ.698 కోట్లు బీజేపీయే సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ రూ.122.5 కోట్లు, ఎన్‌సీపీ రూ.11.34 కోట్లు అందుకున్నాయి.
**2018-19లో రూ.20 వేలకు మించిన విరాళాలు (రూ.కోట్లలో)

పార్టీ విరాళాలు కార్పొరేట్ల వాటా శాతం
బీజేపీ 742.15 698.082 94%
కాంగ్రెస్ 148.5 122.5 82%
తృణమూల్‌ 44.26 42.986 97%
ఎన్‌సీపీ 12.05 11.345 94%
సీపీఎం 3.025 1.186 39%
సీపీఐ 1.595 – 0
మొత్తం 951.66 876.10 92%