Food

ఆయుర్వేద అద్భుతం…వెలగపండు

ఆయుర్వేద అద్భుతం…వెలగపండు

పండ్ల గుజ్జు, ఆకులు, బెరడు పొడిలో పెక్టిన్, టానిన్ వంటి రసాయనాలు కనిపిస్తాయి. వీటిలో అనేక ఔషధ గుణాలుంటాయి.వెలగపండు,మనలో చాలా మందికి ఈ పండు గురించి తెలిసే వుంటుంది. ఈ పండును వినాయక చవితికి సందర్భంగా వినాయకుడిని నైవేధ్యంగా పెడతారు. ఇలా ఎందుకు పెడతారో తెలుసా మీకు. ఎందుకంటే దీనిలో అనేక ఔషధాలు వున్నాయి. ఈ పండు గుజ్జు, ఆకులు, బెరడు పొడిలో పెక్టిన్, టానిన్ వంటి రసాయనాలు కనిపిస్తాయి వీటిని ఔషధాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా 100 గ్రాముల వెలగపండు గుజ్జు ద్వారా 140 క్యాలరీలు, 32 గ్రా పిండి పదార్దాలు, 2 గ్రా ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, సిట్రస్ ఆమ్లాల తో పాటు ఇంకెన్నో శరీరానికి అందుతాయి. ఇకపోతే వెలగపండును తినటం వల్ల మానవునిలో కొన్ని అనారోగ్య సమస్యలు దరి చేరవట. ఉబ్బసం – వెలగపండుతో తయారైన కషాయాలను జలుబు యొక్క నాశనాన్ని తగ్గిస్తుందని అంటారు. దీనితో పాటు, ఇది జలుబు వల్ల కలిగే శ్లేష్మం (కఫం) ను తగ్గిస్తుంది మరియు ఉబ్బసం వ్యాప్తిని తగ్గిస్తుంది. కళ్ళ యొక్క ఇన్ఫెక్షన్ – కళ్ళలో వివిధ ఇన్ఫెక్షన్లు మరియు మంటలకు చికిత్స చేయడానికి వెలగపండు ఉపయోగించబడుతుందని అంటారు.మలబద్ధకం- కడుపు రుగ్మతలలో, వెలగ పండ్లను ఔ షధంగా ఉపయోగిస్తారు మరియు పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మలబద్ధకం తొలగిపోతుంది.రక్త శుద్ధి ఎక్కువగా జరగటం వల్ల కాలేయం,కిడ్నీల పని తీరు మెరుగవుతుంది స్త్రీలు, ఈ పండు తీసుకోవడం వల్ల రొమ్ము,గర్భాశయ క్యాన్సర్లు దరి చేరవట. అలాగే మగ వారికి వీర్యాభివృధ్ధికి ఈ పండు చాలా ఉపయోగపడుతుందట.