DailyDose

హయత్‌నగర్ కార్పోరేటర్‌పై ప్రజల దాడి-నేరవార్తలు

హయత్‌నగర్ కార్పోరేటర్‌పై ప్రజల దాడి-నేరవార్తలు

* హయత్ నగర్ కార్పొరేటర్ సమ తిరుమల రెడ్డి పై పబ్లిక్ ఎటాక్…నాలల కబ్జా వ్యవహారం లో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు అని స్థానికులు ఆగ్రహం.

* అనంతపురంజిల్లాలోని శింగనమల నియోజకవర్గం లో పింఛన్ అడిగినందుకు వృద్ధుడి పై దాడి చేసాడు వాలంటీర్. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి గ్రామం లో ఈ ఘటన జరిగింది. పింఛన్ ఇప్పించాలంటూ గోవిందంపల్లి  గ్రామానికి చెందిన వాలంటీర్ లోకేశ్వరరెడ్డి ని వృద్ధుడు వెంకటరామిరెడ్డి అడిగాడు. అయితే  పింఛన్ ఇప్పించేందుకు రూ.5 వేలు డిమాండ్ చేసాడు వాలంటీర్. దాంతి చేసేదేమిలేక  ఎనిమిది నెలల క్రితం సోదరుడు రామకృష్ణారెడ్డి  ద్వారా రూ.5 వేలు వాలంటీర్ కు వెంకటరామిరెడ్డి ఇచ్చాడు. అప్పటినుండి నెలలు గడుస్తున్నా తనకు పింఛన్ రాకపోవడంతో డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ వాలంటీర్ లోకేశ్వరరెడ్డి ని వెంకటరామిరెడ్డి అడిగాడు. కానీ అప్పుడు మద్యం మత్తులో ఉన్న వాలంటీర్ దాడి అతన్ని పై దాడి చేసాడు. దాంతో వాలంటీర్ పై బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసాడు వెంకటరామిరెడ్డి. ఆ తర్వాత వాలంటీర్ ను సస్పెండ్ చేసారు అధికారులు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్దుడు వెంకటరామిరెడ్డి చికిత్స తీసుకుంటున్నాడు.

* అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెరువుకట్టపై గుర్తు తెలియని వ్యక్తి హత్య. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని దంకౌర్ గ్రామ ప్రజలు ఒక బెలూన్ చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.కామిక్ క్యారెక్టర్ అయిన ఐరన్ మ్యాన్ ని పోలి ఉన్న ఓ బెలూన్ ని చూసి స్థానికులు గ్రహాంతరవాసిగా భావించారు.ఈ బెలూన్ ని గ్యాస్ తో నింపి ఎవరో ఎగరేశారు. ఐరన్ మ్యాన్ స్ట్రక్చర్ తో అది ఒక రోబోలా కనిపించింది.నిన్న ఉదయం అది గాల్లో ఎగురుతూ గ్రామ సమీపంలోని కెనాల్ వద్ద పడింది.చెట్టు పొదలకు ఆనుకుని ఉన్న ఆ బెలూన్ కి చెందిన కొంత భాగం నీటిని తాకుతూ కొద్దిగా ఊగసాగింది.అక్కడకు చేరుకున్న ప్రజలు కాస్త దూరం నుంచి దాన్ని చూస్తూ… దాన్ని ఒక ఏలియన్ గా భావించి, భయపడ్డారు. అది ఊగుతుండటంతో దాన్ని జీవిగానే భావించారు.దీనిపై పోలీసులు మాట్లాడుతూ, దాని ఆకారాన్ని చూసి జనాలు భయపడ్డారని చెప్పారు.ఈ బెలూన్ ను ఎవరు ఎగరేశారనే విషయం ఇంకా తెలియలేదని అన్నారు.

* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ప్రాంతంలో బెట్టింగ్ ముఠాను అర్ధరాత్రి షాద్ నగర్ పోలీసులు పట్టుకున్నారు వారి నుండి 2లక్షల 95వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

* చిత్తూరు జిల్లా గుడిపాల మండలంకి చెందిన వైకాపా కార్యకర్త రాజశేఖర్ సెల్ టవర్ ఎక్కి నిరసన. పార్టీలో తనకు న్యాయం చేయలేదనే విషయాన్ని మండల నాయకుడిపై ఫిర్యాదు చేసిన రాజశేఖర్.

* వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ నేత వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలపై 300లకు పైగా దాడులు జరిగాయని తెలిపారు.

* ఢిల్లీ హైకోర్టు బార్ అసోషియేషన్ కార్యదర్శి అభిజాత్‌కు వచ్చిన బెదిరింపు కాల్‌పై దర్యాప్తు వేగవంతం అయ్యింది.సదరు కాల్ కడప జిల్లా నుంచి వచ్చినట్టుగా చెబుతున్నారు. 08565 అనే ఎస్టీడీ కోడ్‌తో అభిజాత్‌కు కాల్ వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు.బెదిరింపు కాల్ ఎవరు చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.ఆ కోడ్ జిల్లాలోని రాజంపేటకు చెందినది కావడంతో.. సీఎం ఇలాకాలో చర్చ మొదలైంది.వైసీపీ శ్రేణుల్లో జగన్ అభిమానే రాజంపేట నుంచి బెదిరింపు కాల్ చేసినట్టుగా భావిస్తున్నారు.మరోవైపు దర్యాప్తు బృందం రాజంపేటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.