Business

తగ్గిన బంగారం దిగుమతులు

తగ్గిన బంగారం దిగుమతులు

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా బంగారం దిగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) ప్రధాన భాగస్వామి అయిన బంగారు దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 57 శాతం తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో 6.8 బిలియన్ డాలర్ల (రూ.50,658 కోట్లు) విలువైన బంగారం దిగుమతి జరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో 15.8 బిలియన్ డాలర్లు (రూ.1,10,259 కోట్లు) దిగుమతి అయ్యాయి. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-సెప్టెంబర్ అర్ధ సంవత్సరంలో వెండి దిగుమతులు కూడా బాగా పడిపోయాయి. ఈ కాలంలో రూ.5,533 కోట్ల వెండిని 733.57 మిలియన్ డాలర్లకు దిగుమతి చేసుకున్నారు. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఇది 63.4 శాతం పడిపోయింది.