రాబోయే మూడు రోజుల పాటు హైదరబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల కుటుంబాలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. గత వారం రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదా, బురదతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న వర్ష సూచనపై నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో మరో మూడు రోజులు కొనసాగనున్న వర్షాలు
Related tags :