Food

యాపిల్ టీ అంట తాగారా?

యాపిల్ టీ అంట తాగారా?

ఆపిల్‌ని తినడం వల్లే కాకుండా.. ఈ ఫ్లేవర్ టీతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రెగ్యులర్‌ టీకి బదులు ఈ టిీని ట్రై చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.. అవేంటో తెలుసుకోండి.
బాడీ ఫిట్ గా ఉండడంతో పాటు అధిక బరువును తగ్గించేందుకు గ్రీన్ టీ, ఐస్ టీ ఎంతగానో దోహదం చేస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా యాపిల్ టీ గురించి విన్నారా? అవును, యాపిల్ టీ కూడా మీ శరీరంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. యాపిల్ టీ రుచికరంగా ఉండడంతో పాటు ఫిట్ నెస్ ను మెయిన్ టేన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. యాపిల్ టీని తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
*యాపిల్ పండు తొక్కలో అనేక పోషకాలున్నాయి. దాన్నిపడేసే బదులు ఆరోగ్యరిత్యా టీలో ఉపయోగించండి. యాపిల్ టీ ఇప్పటికే యూరప్ లో ఎంతో ప్రజాదరణ పొందింది. యాపిల్ టీ తాగడం వలన రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
**ఉదర సంబంధ సమస్యలన్నింటికీ యాపిల్ టీ చక్కటి ఔషధం.యాపిల్ టీని తరచు తాగడం వలన శరీర బరువులో నియంత్రణలో ఉంటుంది.జాయింట్ పెయిన్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.యాపిల్ టీ తాగితే సౌందర్యం పెరుగుతుంది. చర్మం కాంతి వంతంగా మెరుస్తుంది.
*యాపిల్ టీ తయారీ:
ఓ పాత్రలో టీకి సరిపడా నీళ్లు తీసుకోండి. నీటితో శుభ్రం చేసిన యాపిల్ పండును చిన్న చిన్న ముక్కలుగా కోయండి. ఆ ముక్కలను నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత టీ పొడి, లవంగాలు, దాల్చినచెక్క కొంచెం వేసి కలిపి.. మరికాసేపు మరిగించాలి. అనంతరం కొంచెం తేనెను కలపాలి. టీ కాస్త చల్లబడిన తర్వాత తాగాలి.