Food

నాచు తినండి…బండి నడిపించండి!

నాచు తినండి…బండి నడిపించండి!

నాచుని తినటం అంటే మనకి కొత్తగా ఉండొచ్చు కానీ. రాబోయే రోజుల్లో నాచు మనం తినే ఫుడ్‌లో మెయిన్ పార్ట్ కాబోతోంది. నైరుతి ఆసియా దేశాల్లో ఇప్పటికే సీవీడ్ ఫుడ్ కల్చర్ ఫుల్‌‌గా డెవలప్ చేస్తున్నారు. సీవీడ్ సాధారణంగా గోధుమ, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటుంది. గోధుమ రంగులో ఉండే సీవీడ్ ను వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
***సీవీడ్… సముద్రపు నాచే కదా అని తేలికగా తీసిపారేయొద్దు. మనం తినే తిండి, బండ్లలో వాడే పెట్రోల్, డీజిల్ కూడా సీవీడ్​తోనే తయారు చేస్తరట. సముద్రపు నాచుని ప్రాసెసింగ్ చేసి సేంద్రీయ ఎరువుగా ఉపయోగించడం తెలుసు. సీవీడ్​తో ప్యాకింగ్ కవర్స్, వాటర్ పాడ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, మందులు, న్యాప్​కిన్స్, ర్యాపర్స్, టూత్​పిక్స్ కూడా తయారు చేస్తారని విన్నాం. కానీ, ఫ్యూచర్​లో సముద్రపు నాచు మనం తినే తిండిలో మెయిన్ ఐటమ్ కావొచ్చని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌‌‌‌, మినరల్స్‌‌‌‌, విటమిన్లు ఎక్కువగా ఉండే సముద్రపు నాచును ఇప్పటికే చాలా దేశాల్లో వంటకాల్లో వినియోగిస్తున్నారట.
**ఎలా సాగు చేస్తారు?
30 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్, 30 కి పైగా ఉప్పుశాతం ఉన్న నీళ్లలో సీవీడ్ పెరుగుతుంది. సముద్ర తీరానికి కొంత దూరంలో అలల తాకిడి తక్కువగా ఉన్నచోట పెంపకానికి అనువుగా ఉంటుంది. రాఫ్ట్ పద్ధతిలో, నెట్ బ్యాగ్ పద్ధతిలో సీవీడ్ ని పెంచుతారు. నీళ్లమీద ఈ మొక్కల ఆనవాళ్లు కనిపించేలా బెండ్లు, ప్లాస్టిక్ బాటిళ్లు ఉంచి, అవి కొట్టుకుపోకుండా బరువైన దిమ్మెలు కడతారు. పది కిలోల సీడ్ వేస్తే 45 రోజుల్లో దాదాపు 100 కిలోల వరకు పెరుగుతుంది. అది అమ్మినా 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సీవీడ్ సీడ్స్ కి ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. ఆ తర్వాత పెరిగిన మొక్కనే సీడ్ లా ఎన్నిసార్లయినా వాడొచ్చు. దిగుబడి తర్వాత సీవీడ్ ని బై ప్రొడక్ట్ గా తయారు చేస్తున్నారు. పొడిగా చేసి రెండేళ్ల వరకు నిలువ ఉంచవచ్చు. దీన్ని చేపలు, రొయ్యలకు ఫుడ్ గా ఉపయోగించవచ్చు.
***ఫుడ్ కల్చర్
నాచులో మస్తు పోషకాలుంటయ్. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌‌‌‌, మినరల్స్‌‌‌‌, విటమిన్ బీ, సీ, ఈ పుష్కలంగా లభిస్తాయి. నాచుతో రుచికరమైన వంటలు కూడా చేసుకోవచ్చు. పైగా ఆ ఫుడ్‌‌‌‌ ఆరోగ్యానికి మంచిది కూడా. కాస్త తిన్నా అందులోని పోషకాలు బాడీకి అందుతాయి. అంతేకాదు, వెజిటేరియన్లకు, వేగన్స్ కి సీవీడ్ బెస్ట్ చాయిస్. నైరుతి ఆసియా దేశాల్లో ఇప్పటికే సీవీడ్ ఫుడ్ కల్చర్ ఫుల్​గా డెవలప్ చేస్తున్నారు. సీవీడ్ సాధారణంగా మూడు రంగుల్లో ఉంటుంది. గోధుమ, ఎరుపు, ఆకుపచ్చ. గోధుమ రంగులో ఉండే సీవీడ్​ను వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దాని తర్వాత రెడ్ కలర్ సీవీజ్ ను తినేందుకు ఇష్టపడతారు. ఇప్పటికే ఆసియా దేశాల్లో చాలావరకు సముద్రపాచిని వంటకాల్లో వాడుతున్నారు. జపాన్ లోని రెస్టారెంట్ల మెనూలో సీవీడ్ సలాడ్ తప్పకుండా ఉంటుందట. అక్కడ సీవీడ్ సూప్​ను, సీవీడ్ నూడుల్స్ ను చాలామంది ఇష్టంగా తీసుకుంటారట.
**సీవీడ్ ఫ్యూయెల్!
సీవీడ్స్ వేగంగా పెరిగే ఆల్గే. ఇవి సూర్యరశ్మిని, సముద్రపు నీళ్లలోంచి పోషకాలు, కార్బన్​డయాక్సైడ్​ను తీసుకుంటాయి. వాతావరణంలో కార్బన్ ఎమిషన్స్​ తగ్గించడంలోనూ సీవీడ్ సాయపడుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. సీవీడ్ నుంచి ఫ్యూయెల్ తయారుచేసేందుకు కూడా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కాలిఫోర్నియా రెయిన్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే యూఎస్ నుంచి నిధులు సేకరించింది. సీవీడ్ నుంచి ఫ్యూయెల్ తయారు చేసేందుకు సీవీడ్ స్కేలింగ్ చేస్తోంది. కల్టివేషన్ ద్వారా ఏటా దాదాపు 200 టన్నుల సీవీడ్​పండిస్తున్నారు. త్వరలోనే సీవీడ్ నుంచి ఫ్యూయెల్ తయారు చేసే మెకానిజం డెవలప్ చేస్తామని చెప్తున్నారు.
**మస్తు బిజినెస్ అవుతోంది
సీవీడ్ బిజినెస్​కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. గడిచిన 20 ఏండ్లలో సీవీడ్ కల్టివేషన్ చాలా డెవలప్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 మిలియన్ టన్నులకు పైగా సీవీడ్ ఉత్పత్తి అవుతోందని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ నివేదించింది. దీంతో వరల్డ్ వైడ్​గా 6 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బిజినెస్​ అయిందట. నార్వే, డెన్మార్క్ దేశాల్లో సీవీడ్ కల్టివేషన్ ని డెవలప్ చేసేందుకు, వాణిజ్య వ్యవసాయంలా మార్చేందుకు సింటెఫ్ వంటి కంపెనీలు కొత్త పద్ధతులపై రీసెర్చ్ చేస్తున్నాయట. ఇప్పటికి చాలావరకు చేపల ఫుడ్, పశువుల దాణా, ఎరువులుగా సీవీడ్​ని వినియోగిస్తున్నారు. కానీ, ఫ్యూచర్ లో బయోగ్యాస్, ఫుడ్ కల్చర్​లో ఎక్కువగా వినియోగించేందుకు కృషి చేస్తామని అక్కడి సైంటిస్టులు చెప్తున్నారు.
**పోర్చుగల్​లో చెరువులు, ట్యాంకులలోనూ సీవీడ్ పండిస్తున్నారు. అల్గాప్లస్ అనే సముద్రపు నాచుని లోతట్టు నీళ్లల్లో సాగు చేస్తున్నారు. ఆఫ్​షోర్ వ్యవసాయంతో పోలిస్తే ఈ టైప్ సాగుతో చాలా ప్రయోజనాలున్నాయని అక్కడి మెరైన్ బయాలజిస్ట్ ఎంఎస్ అబ్రూ చెప్తున్నారు. ట్యాంకుల్లో టెంపరేచర్ మెయింటేన్ చేయడం ద్వారా ఏడాది పొడవునా సీవీడ్ సాగవుతోందని అంటున్నారు. ఇందులో సాగైన సీవీడ్ ని ఫుడ్, కాస్మొటిక్స్ కంపెనీలకు, హైఎండ్ రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నామని వెల్లడించారు. ‘‘మైక్రో ఆల్గేను ట్యాంక్ వ్యవస్థలో పెంచుతాం. దీనికి ఫుడ్ కల్చర్ లో చాలా డిమాండ్ ఉంది. ఇందులో ఉత్పత్తి అయిన సీవీడ్ ని హై ఎండ్ రెస్టారెంట్లకు సప్లై చేస్తాం. పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, టర్కీ దేశాల్లో ఇలాంటి విధానంలో సీవీడ్ కల్టివేషన్ చేస్తున్నారు. ఆన్ షోర్ సీవీడ్ పెంపకం కెనడా, దక్షిణాఫ్రికాలో కూడా బాగా జరుగుతోంది. ఏటా సీవీడ్ కల్టివేషన్​కు మల్టీ నేషన్ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఫ్యూచర్ లో సీవీడ్ ఫుడ్ మనం తినే మెనూలో మెయిన్ ఐటమ్ అవుతుందనే నమ్మకం ఉంది”అని అబ్రూ చెప్తున్నారు.
***కాస్మొటిక్స్ అండ్ మెడిసిన్
మెడిసిన్ తయారీలో వినియోగించేందుకు సీవీడ్ ఉత్పత్తి అయిన వెంటనే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఎండబెట్టిన సముద్రపు నాచును ఫుడ్ కల్చర్ లో ఉపయోగిస్తున్నారు. పులియబెట్టిన సీవీడ్​ను​ పశువుల దాణాగా వాడుతున్నారు. సీవీడ్​ను టూత్ పేస్టులు, సబ్బులు, కాస్మొటిక్స్, మెడిసిన్ తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నాచును రీసైకిల్ చేసి ప్యాకింగ్ కవర్స్ చేస్తారు. అంతేకాదు, క్యాన్సర్ ని నివారించేందుకు తయారు చేసే మెడిసిన్ లోనూ సీవీడ్​కు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా దుస్తులు, బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్, వాటర్ క్యాప్సూల్స్, డ్రింకింగ్ స్ట్రాస్‌‌ వంటి వస్తువులను కొన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇప్పటివరకు సముద్ర పాచిని ఎక్కువగా ఫుడ్ కల్చర్ లోనే వినియోగిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి.
***సీవీడ్ ఎరువు
కొన్ని ప్రాంతాల్లో రైతులు సీవీడ్‌‌‌‌తో సేంద్రియ ఎరువులు తయారుచేస్తున్నారు. మనదేశంలో ‘కప్పాప్‌‌‌‌హైకస్‌‌‌‌ సాప్‌‌‌‌’ అనే రకం నాచు రసాన్ని వరి, మినుము పంటలు ఏపుగా పెరిగేందుకు, పంట ఆరోగ్యంగా ఉండేందుకు చల్లుతున్నారు. సీవీడ్‌‌‌‌ ఎరువులకు మంచి గిరాకీ వస్తుండటంతో చేపలు పట్టేవాళ్లు సీవీడ్ సాగుపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పశువులకు దాణాగా నాచు వేస్తే అవి విడుదల చేసే ‘మిథేన్‌‌‌‌’ స్థాయి తగ్గడంతో గ్లోబల్ వార్మింగ్ తగ్గుముఖం పట్టే చాన్సెస్ ఉన్నాయి. సీవీడ్‌‌‌‌ ఫెర్టిలైజర్స్‌‌‌‌ వల్ల రానున్నరోజుల్లో వ్యవసాయ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చే చాన్సెస్ ఉన్నాయని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. దేశంలో సీవీడ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌కి గుజరాత్ అడ్డాగా మారింది.
**సీఎస్‌‌‌‌ఎంసీఆర్ఐ రెండేళ్ల కిందట కొంత మంది రైతులకు నాచుతో ఫెర్టిలైజర్‌‌‌‌ తయారీలో ట్రైనింగ్ ఇచ్చింది. తీర రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడులో ప్రభుత్వాలు జాలర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చి సాగు చేయిస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండి చేపల వేట సాధ్యం కాని సమయాల్లో సీవీడ్ కల్టివేషన్ వాళ్లకు జీవనాధారంగా మారింది. ఒక్కో పంటకు 45 రోజుల సమయం పడుతుంది. దీంతో తేలికగా రెండు పంటలు పండించగలుగుతున్నారు. గుజరాత్‌‌‌‌ జాలర్లు ‘ గ్రేసీలేరియా దురా’ అనే సముద్రపునాచు రకం పెంపకం ద్వారా పంటకు లక్ష రూపాయలకు పైనే సంపాదిస్తున్నారు.
**కొబ్బరి బోండాం, జ్యూస్‌‌‌‌, కూల్‌‌‌‌డ్రింక్స్‌‌‌‌ల కోసం ప్లాస్టిక్ స్ట్రాను ఉపయోగిస్తుంటాం. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేస్తారు కానీ, స్ట్రాలను మాత్రం చెత్తలో పడేస్తారు. ఆ చెత్తంతా చివరకు సముద్రంలోనే కలుస్తుంది. ప్లాస్టిక్‌‌‌‌ ఉత్పత్తుల్లో స్ట్రా చిన్నదే కదా అనుకుంటాం. కానీ, అది సృష్టించే సమస్య ఊహకందని స్థాయిలో ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌‌‌‌ పెట్టేందుకు కొన్ని కంపెనీలు సీవీడ్‌‌‌‌తో స్ట్రాలను తయారు చేస్తున్నాయి. ‘డిజైన్డ్‌‌‌‌ టు డిసప్పియర్‌‌‌‌’ స్ట్రాలు ఎకో ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. ఇవి ప్లాస్టిక్‌‌‌‌ స్ట్రాల మాదిరిగానే కనిపిస్తాయి. వాడి పడేశాక అరవై రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి. మన దేశంలో చాలా చోట్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌‌‌‌పై నిషేధం ఉండటంతో సీవీడ్ స్ట్రాల వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. చెట్లు, కలప నుంచి తయారయ్యే పేపర్ స్ట్రాల ప్లేస్ లో సీవీడ్ స్ట్రాలను ఉపయోగించడం ఒకరకంగా అడవులను కాపాడినట్లే అవుతుంది కూడా.
***రెండు టేబుల్ స్పూన్ల సీవీడ్ లో..
కేలరీలు 5
కొవ్వు 0.1 గ్రాములు
కొలెస్ట్రా ల్ 0 మిల్లీగ్రాములు
సోడియం 87 మిల్లీగ్రాములు
పొటాషి యం 5 మిల్లీ గ్రాములు
కార్బోహైడ్రేట్లు 0.9 గ్రాములు
ప్రోటీన్ 0.3 గ్రాములు
విటమిన్ ఎ 1శాతం
విటమిన్ సి 1 శాతం
కాల్షియం 2 శాతం
ఐరన్ 1 శాతం