మీరు ప్యాకెట్ పాలు వాడుతున్నారా..మీ కోసమే ఈ షాకింగ్ నిజాలు
పాలు మంచి పౌష్టికాహారం అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాని ఇప్పుడు మనం తాగే పాలు, తినే పాల ఉత్పత్తుల్లో 70శాతం ప్రాసెసింగ్ చేసిన మిల్స్ ప్రొడక్ట్సే.. టీ స్టాళ్లు, హోటళ్లలో తాగే టీ, కాఫీల్లో వాడే పాలు నూరు శాతం ప్రాసెస్ చేసినవి.. ఇంతకీ పాలను ఎలా ప్రాసెస్ చేస్తారు, మనం వాడే ప్యాకెట్ పాలకు కారణమయ్యే పాలపొడిని ఏవిధంగా చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే..
మొదటగా’సెంట్రిఫ్యూజ్’అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్‌ను, కొవ్వును, నీటిని వేరు చేస్తారు. కొవ్వును ఐస్‌క్రీం కంపెనీలకు అమ్మి, మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి దానిని “పాశ్చురైజేషన్” చేస్తారు. అంటే ఎక్కువ వేడి, వెంటనే బాగా చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని, సూక్ష్మజీవులను చంపేయడమనే ప్రక్రియ.
ఇక ప్యాకెట్ పాల తయారీకి మూలమైన పాలపొడి కోసం.. ఎక్కువ వత్తిడితో ఒక చిన్న రంధ్రం లోంచి పాలను గాలిలోకి పిచికారీ చేయడం ద్వారా పాలపొడి తయారవుతుంది. అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ శరీరానికి మంచిదే కాని ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇంకా తొందరగా మూసేస్తుందని, గుండె జబ్బులకి, రక్తనాళాల జబ్బులకు కారణమౌతుందని తాజాగా పరిశోధనలో వెల్లడైంది.
తక్కువ కొవ్వుండే పాలు గుండె జబ్బులకు మంచిదనే కారణంతో ప్యాకెట్ పాలను వాడుతుంటే నిజానికి వాటివల్లే గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకెట్ పాలు కొద్ది రోజులు నిల్వ ఉండేందుకు వీలుగా వాడే పోర్సిలిన్ తరహా రసాయనాలు శరీరానికి తీవ్రస్థాయిలో హాని చేస్తాయి.
భయంకరమైన కృత్రిమ పాలూ తయారు చేస్తున్నారు:
ఇటీవలి కాలంలో వరుస కరువులతో పాడి సంపద భారీగా తగ్గపోయింది. దీంతో కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. పైన పేర్కొన్న ప్యాకెట్ పాలకంటే ఇవి మహా భయంకరమైనవి. విష రసాయనాలతో కూడుకున్న కృత్రిమ పాలు తాగితే మనిషిలోని ప్రతి అవయం మీదా ప్రభావం పడుతుంది. యూరియా, ఇతర రసాయనాలను కలిపి వీటిని తయారు చేస్తున్నారు.చిన్నపిల్లలు తాగడం వల్ల వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ
మనం తాగుతున్న పాలులో సాదారనంగా వాడే కల్తీ పదార్ధాలు ఏమిటంటే కార్బనేట్, బై కార్బనేట్, స్టార్చ్, యూరియా, హైడ్రేటడ్ లైం, ఫార్మోలిన్ మరియూ అమోనియం సల్ఫేట్ అని నిపుణులు చెబుతున్నారు.
పాలులో ఉండే అసిడిటీని కంట్రోల్ చేయడానికీ, పాడైపోకుండా ఉండటానికీ, ఎక్కువ రోజులు నిలువ చేయడానికీ న్యూట్రలైజర్స్ వాడుతారని ఒక డైరీ టెక్నాలజిస్ట్ తెలియజేసేరు.ఈయన పేరు బయట పెట్టకుండా ఉంటే మరికొన్ని విషయాలు తెలియజేస్తామన్నారు.
మామూలుగా పాలులో వాడే న్యూట్రలైజర్స్ ఏమిటంటే బై కార్బనేట్ నుండి సోడియం బై కార్బనెట్ వరకు వాడతారని తెలిపేరు.అంటే వాషింగ్ సోడా, కాస్టిక్ సోడా, బేకింగ్ సోడా అని తెలిపేరు. ఇందులో కాస్టిక్ సోడా తప్ప మిగిలినవి తినకూడనవిట.
మిగిలిన కల్తీ పదార్ధాలు యూరియా గానీ, టాపియాకో స్టార్చ్ గానీ అయ్యుంటాయట. పాలుకు చిక్కదనం రావడానికి వీటిని కలుపుతారట.ముఖ్యంగా కొవ్వు తీసేసిన పాలుకు ఇవి కలుపుతారట.పాలు యొక్క చిక్క దనాన్ని కొలిచే స్కేల్ ను ఎస్.ఎన్.ఎఫ్(SNF) అంటారు. పాలులో ఎస్.ఎన్.ఎఫ్ కౌంటింగ్ ను బట్టి పాలులో నీళ్లు కలిపేరా లేదా అని తెలుసుకుంటారు.పాలులో ఎస్.ఎన్.ఎఫ్ 8 శాతానికి పైగా ఉంటే ఆ పాలును సరఫరా చేసిన వారి మీద అతి పెద్ద జరిమానా విధిస్తారు. కల్తీ పదార్ధాలు కలపడం వలన ఎస్.ఎన్.ఎఫ్ పెరుగుతుంది. చిక్కదనం పెరుగుతుంది.
ఐ.సి.ఎం.ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వారి రిపోర్ట్ ప్రకారం ఈ కల్తీ పదార్ధాలు మన ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుందట. ఫుడ్ పాయిజనింగ్, గాస్ట్రో ఇంటస్టైన్ కాంప్లికేషన్స్ మరియూ శరీరంలోని ప్రోటీన్లను నాశనం చేయటం జరుగుతుందట.
పాలులో ఉండే యూరియా కిడ్నీలను పాడుచేస్తుంది. కాస్టిక్ సోడా రక్త పోటునూ,హ్రుదయ వ్యాధులను పెంచుతుందని డయటీషియన్ డాక్టర్ మహతి తెలియజేసేరు.
తమ బ్రాండ్ పాలు చిక్కగా ఉంటుందని ప్రకటనలు చేసేవారు తమ పాలులో స్టార్చ్ కలుపుతూ, ఆ పాలు పాడైపోకుండా ఎక్కువకాలం ఉండటానికి కాస్టిక్ సోడా కలుపుతారని డైరీ టెక్నాలజిస్ట్ తెలిపారు.