శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అవతారం లో భక్తులకు దర్శనమిస్తున్నారు.
40 లక్షల రూపాయల విలువైన కనకపుష్యరాగం హారాన్ని బహూకరించిన తాతినేని శ్రీనివాస్, లీల దంపతులు.
అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడిన విజయవాడకు చెందిన తాతినేని శ్రీనివాస్ లీలా దంపతులు సోమవారం 40 లక్షల రూపాయల విలువ కలిగిన కనకపుష్య హారాన్ని బహూకరించారు. ఇది తన పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఏడువారాల నగలు విశిష్టతను ఆలయ అర్చకులు శాండల్య వివరిస్తూ వారంలో ఏడు రోజులు ప్రతిరోజు ఆయా గ్రహాల అధిపతుల ఆధారంగా గత ఆరు నెలల నుండి ఏడువారాల నగలను అలంకరించడం జరుగుతుందన్నారు.
ఆలయ ఈవో యం.వి.సురేష్ బాబు మాట్లాడుతూ ఏడువారాల నగలు చేయించేందుకు ముందుకు వచ్చే దాతలు తమను ముందుగా సంప్రదిస్తే వివరాలు తెలుపుతామన్నారు.