ఏకంగా 7,801 వజ్రాలతో రూపొందించిన ‘ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం’ అనే వజ్రపుటుంగరానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ‘ది డైమండ్ స్టోర్ బై చందూబాయి’ నిర్వాహకులు ఈ అరుదైన ఉంగరాన్ని తయారు చేశారు. తమ దుకాణంలో సోమవారం ఈ వజ్రపుటుంగరాన్ని వారు ప్రదర్శించారు. దాదాపు 11 నెలలు కష్టించి రూపొందించిన ఉంగరానికి ‘మోస్ట్ డైమండ్స్ సెట్ ఇన్ ఏ రింగ్’ విభాగంలో గిన్నిస్ రికార్డ్స్‌లో చోటుదక్కిందని నిర్వాహకులు చందూబాయి, శ్రీకాంత్ వెల్లడించారు. దీన్ని అంతర్జాలంలో విక్రయించేందుకు త్వరలోనే ఏర్పాట్లు చేస్తామన్నారు.
7801 వజ్రాలతో ఉంగరం – The Divine 7801

Related tags :