Food

₹10లకే బిరియాని అన్నాడు. పోలీసులు అరెస్ట్ చేశారు.

₹10లకే బిరియాని అన్నాడు. పోలీసులు అరెస్ట్ చేశారు.

బిర్యానీ రూ.10లకే విక్రయిస్తే అరెస్టు చేయటం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి. తమిళనాడులోని అరుప్పుకొట్టైలో జహీర్‌ అనే వ్యక్తి ఆదివారం ఓ హోటల్‌ను ప్రారంభించాడు. కస్టమర్లు హోటల్‌కు అలవాటు పడేందుకు తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకూ కేవలం రూ.10లకే బిర్యానీని విక్రయిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో జనం బారులుతీరారు. ఫలితంగా తోపులాట ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలను గాలికొదిలేశారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా నిలబడటం.. చాలా మంది మాస్కులు ధరించకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసులు అక్కడకు చేరుకునేలోపు యజమాని తయారు చేయించిన 2500 బిర్యానీ పొట్లాల్లో దాదాపు సగం వరకూ విక్రయించారు. వారు హోటల్‌ యజమాని జహీర్‌ను అరెస్టు చేశారు. మిగిలిన బిర్యానీ పొట్లాలను యాచకులకు పంపిణీ చేశారు. హోటల్‌ యజమానిపై 188, 269, 278 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించి బెయిల్‌పై విడుదల చేశారు.