అబార్షన్లు నివారించడంతో పాటు శృంగారం వల్ల వచ్చే కొన్ని వ్యాధులను నిరోధించేందుకు ఈ రకమైన చట్టాన్ని రూపొందించారు. కండోమ్స్ వాడకం విషయంలో కొన్ని దేశాలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మహిళల్లో అబార్షన్లు నిరోధించడంతో పాటు శృంగారం వల్ల వచ్చే కొన్ని వ్యాధులను నిరోధించేందుకు కండోమ్ వాడకాన్ని చాలా దేశాలు ప్రొత్సహిస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో అమెరికాలో వెర్‌మొంట్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కండోమ్‌లను ఇచ్చేలా కొత్త చట్టం రూపొందించింది.అమ్మాయిలు అనవసరంగా గర్భం దాల్చకుండా ఉండటంతో పాటు శృంగారం వల్ల వచ్చే కొన్ని వ్యాధులను నిరోధించేందుకు ఈ రకమైన చట్టాన్ని రూపొందించారు. ప్రతి స్కూల్‌లో ఉచితంగా కండోమ్‌లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పలు పబ్లిక్ ప్లేస్‌లలోనూ వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ చట్టాన్ని వెర్’మెంట్ ఆరోగ్య, విద్యాశాఖలు కూడా స్వాగతించాయి. 2019లో రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వేలో కేవలం 32 శాతం మంది స్కూల్ విద్యార్థులు మాత్రమే కండోమ్స్ వాడుతున్నట్టు తేలింది.ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి టాపర్ మెక్‌ఫామ్ మాట్లాడుతూ… అబార్షన్లను నిరోధించడంతో పాటు విద్యార్థుల సేఫ్టీ కోసమే ఈ చట్టాన్ని చేసినట్టు తెలిపారు.కండోమ్స్ అందుబాటులో ఉంచడం ద్వారా సెక్సువల్ బిహేవియర్ పెరగదని.. కండోమ్స్ వాడకం మాత్రమే పెరుగుతుందని 2018లో నిర్వహించిన అమెరికన్ జర్నల్ ఆఫ్ హెల్త్ ప్రమోషన్ స్టడీ పేర్కొంది.అయితే స్కూల్ పిల్లలకు కండోమ్స్ అందుబాటులో ఉంచటం వంటి చర్యను కొందరు వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో స్కూల్ పిల్లలకు కండోమ్స్ ఇస్తున్న తొలి రాష్ట్రంగా వెర్‌మొంట్ నిలిచింది.
వెర్మాంట్ విద్యార్థులకు ఉచితంగా కండోమ్‌లు
Related tags :