Health

చైనాలో అందరికీ టీకాల పంపిణీ-TNI కరోనా బులెటిన్

China To Distribute Experimental Vaccine To Public

* ఏపీలో 7,93,299కు చేరిన కరోనా బాధితుల సంఖ్య.రాష్ట్రంలో కొత్తగా 3,746 కరోనా కేసులు, 27 మరణాలు.రాష్ట్రంలో 7,93,299కు చేరిన కరోనా బాధితుల సంఖ్య.రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6,508 మంది మృతి.రాష్ట్రంలో ప్రస్తుతం 32,376 కరోనా యాక్టివ్‌ కేసులు.ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 7,54,415 మంది బాధితులు.రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 74,422 మందికి కరోనా పరీక్షలు.రాష్ట్రంలో ఇప్పటివరకు 72.71 లక్షల మందికి కరోనా పరీక్షలు.

* తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 41,475 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,579 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,26,124కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,287కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,811 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,04,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,449 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 17,071 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 39,40,304కి చేరింది.

* అతి తక్కువ ఖర్చుతో కొవిడ్‌-19 వ్యాధి నిర్ధారణ చేయగల విధానాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు కనుగొన్నారు. ‘కొవిరాప్‌’ అనే ఈ పరికరం ఖరీదు కేవలం రూ.10,000 కాగా.. దీని ద్వారా ఒకసారి పరీక్ష చేసేందుకు అయ్యే ఖర్చు కూడా రూ.500 కావటం గమనార్హం. ఇక్కడి ప్రొఫెసర్లు సుమన్‌ చక్రబర్తి, డాక్టర్‌ అరిందమ్‌ మొండెల్‌ల నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ ఘనతను సాధించారు. కాగా, ఈ విధానానికి ఐసీఎంఆర్‌ అనుమతి కూడా లభించటం విశేషం. ఈ విధానం సులభమే కాకుండా.. ఒక గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చని పరిశోధకులు వివరించారు.

* అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే కొవిడ్‌-19 వ్యాక్సిన్లను వినియోగించాలనే నిబంధనను సడలించి.. సాధారణ వ్యక్తులకు కూడా అందించేందుకు చైనా యంత్రాగం అనుమతించింది. ఈ క్రమంలో ప్రయోగాత్మక కరోనా వైరస్‌ వ్యాక్సిన్లను ప్రజలకు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఈ టీకా రెండు డోసుల ధర 60 డాలర్లుగా నిర్ణయించారు. తొలుత ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌, షావోజింగ్‌ నగరంలో 18-59 ఏళ్ల మధ్య వయసు గల ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చైనా ప్రకటించింది. కాగా, వ్యాక్సిన్‌ తమకెందుకు వేయాలో వారు దరఖాస్తులో వివరించాల్సి ఉంటుంది. అయితే వ్యాక్సిన్‌ పేరు, ఎప్పుడు, ఎన్ని డోసులు అందించేదీ తదితర వివరాలను మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం.