కియారా అడ్వాణీ బాలీవుడ్‌లో కాస్త దూకుడుగానే ముందుకు పోతుంది. ఆమె అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘లక్ష్మీబాంబ్’ వచ్చే నెల్లో ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ షోలో నేహా ధూపియా అడిగిన ప్రశ్నకు కియారా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అనుకుంటున్నారు? అని కియారాను అడిగితే ‘‘హృతిక్ రోషన్‌లా అందంగా ఉండాలి. అంబానీల్లా డబ్బు ఉండాలి. ఫర్హాన్ అక్తర్, ఆయుష్మాన్ ఖురానాలా ప్రతిభ ఉండాలి. అక్షయ్‌కుమార్‌లా క్రమశిక్షణ, స్టామినా ఉండాలి’’ అంటూ కాబోయేవాడి లక్షణాల గురించి పెద్ద జాబితాయే చెప్పింది. సమయానికి ఆహారం అందకపోతే తన విశ్వరూపం చూపిస్తుందట కియారా. ‘‘టైంకి ఆహారం పెట్టకపోతే నాకు చాలా కోపం వచ్చేస్తుంది’’అంటోంది కియారా. బెండకాయ, సాల్మన్ చేప కూర అంటే ఆమెకు ఇష్టమట. ‘‘కాస్త భిన్నమైన కాంబినేషన్ వంటకమే ఇది. కానీ నాకు చాలా ఇష్టం’’అని చెప్పింది కియారా.
అక్షయ్ లాగా ఉండాలి
Related tags :