NRI-NRT

హైదరాబాద్ వరద బాధితులకు ఎన్నారై తెరాస దక్షిణాఫ్రికా సాయం

హైదరాబాద్ వరద బాధితులకు ఎన్నారై తెరాస దక్షిణాఫ్రికా సాయం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ఎంతో మంది నిరాశ్రులయ్యారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కనీవినీ ఎరుగని వర్షాల వల్ల అనేకమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అంబర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో తమ శాఖ ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కారక్రమంలో ఎన్నారై శాఖ తరఫున మేడసాని శ్రవంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ పంపిణీ సహాయ కార్యక్రమానికి సహకరించిన అందరికి టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ తరఫున ఆ శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ధన్యవాదాలు తెలిపారు.