తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లో నటుడిగా రాణించాక రాజకీయాల్లోకి వచ్చారు. సీఎం అయి తమిళనాడును 1977 నుంచి 1987 సంవత్సరాల మధ్య పాలించారు. ఇక కరుణానిధి రచయిత. రాజకీయ నాయకుడిగా మారారు. తమిళనాడును దాదాపుగా 2 దశాబ్దాల పాటు 5 సార్లు సీఎంగా పాలించారు. 1969 నుంచి 2011 మధ్య ఆయన సీఎంగా పనిచేశారు. అయితే ఈ ఇద్దరిలోనూ మనం ఒక కామన్ విషయాన్ని గమనించవచ్చు. అదేమిటంటే. ఎంజీ రామచంద్రన్, కరుణానిధి ఇద్దరూ నలుపు రంగు సన్ గ్లాసెస్‌ను ధరించేవారు. చాలా మందికి అసలు విషయం తెలియక వారు ఆ అద్దాలను స్టైల్ కోసం ధరిస్తారని అనుకునేవారు. అయితే నిజానికి వారు ఆ గ్లాసెస్‌ను ధరించింది స్టైల్ కోసం కాదు, పలు సమస్యల వల్ల.ఎంజీ రామచంద్రన్ కు కంటి సమస్య ఉండేది. అందువల్ల ఆయన సూర్యకాంతిని, లైట్‌ను చూడకూడదని చెప్పి గ్లాసెస్ ధరించాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన అప్పటి నుంచి ఆ గ్లాసెస్‌ను ధరించడం మొదలు పెట్టారు. ఆయన గ్లాసెస్ లేకుండా బయట దాదాపుగా ఎప్పుడూ కనిపించలేదు. ఇక కరుణానిధి 1960లలో యాక్సిడెంట్ వల్ల ఎడమ కన్ను కోల్పోయారు. ఈ క్రమంలో కంటి వైద్యులు ఆయనకు కూడా అద్దాలను ధరించాలని సూచించారు. దీంతో కరుణానిధి కూడా అప్పటి నుంచి అద్దాలను ధరిస్తూ వచ్చారు. అయితే యాదృచ్ఛికంగానే తమిళనాడు ఇద్దరు సీఎంలకు కంటి సమస్యలు రావడం, గ్లాసెస్‌ను ధరించడం జరిగింది. కానీ ఆ అద్దాల వల్ల వారు స్టైల్ ఐకాన్‌గా మారారు. కార్టూనిస్టులు ఆ అద్దాలతోనే వారి బొమ్మలు గీసి కార్టూన్లు వేశారు. ఆ ఇద్దరూ బయట ఎప్పుడూ తమ తమ అద్దాలను తీసి కనిపించలేదు.
కరుణానిధి కళ్లద్దాలు స్టైల్ కాదు తంబి…
Related tags :