* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 76,726 కరోనా పరీక్షల నిర్వహించగా.. 3,620 కొత్త కేసులు నమోదు కాగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,96,919కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,524 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,723 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,58,138కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,257 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 73,47,776 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
* సీరియస్ గా హీరో రాజశేఖర్ ఆరోగ్యం..యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది.ఆయన మరియు ఆయన భార్యా పిల్లలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే.అయితే ఆయన పిల్లలు శివాని, శివాత్మిక కరోనా నుంచి కోలుకున్నారు.కానీ, హీరో రాజశేఖర్ మరియు ఆయన భార్య జీవిత ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు.అయితే హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తాజాగా ఆయన కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది.తన తండ్రి త్వరగా కోలుకొని ఇంటికి తిరిగిరావలని కోరుకుంటూ అభిమానులందరిని ప్రార్థన చేయమని కోరింది.
* కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా పాజిటివ్కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణకనిపించని కరోనా లక్షణాలుసెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్లిపోయిన కోమటిరెడ్డితెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్ట్ చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు మాత్రం ఆయనలో కనిపించలేదు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోమటిరెడ్డి కోరారు. మరోవైపు ప్రజల మధ్యలో తిరుగుతుండే రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీరు కరోనా బారిన పడుతున్నారు.
* కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 30 అత్యంత కరోనా ప్రభావిత జిల్లాలను ప్రకటించింది.దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కాస్త తగ్గినా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం విలయతాండవం చేస్తోంది.ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఏపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడు నెలల కాలం తర్వాత దేశంలో తొలిసారి మంగళవారం 50 వేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10,32,795 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 46,790 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.అయితే, దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 67 శాతం కేవలం 6 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఆయా రాష్ట్రాల్లో టాప్-5 జిల్లాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల్లో ఈ వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్నట్టు పేర్కొంది.దేశవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాల్లో ఏపీలో 5 జిల్లాలు ఉన్నాయి.తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా విజృంభణ అధికంగానే ఉందని కేంద్రం తాజా గణాంకాల్లో వెల్లడించింది.మంగళవారం కూడా తూర్పు గోదావరిలో 457, పశ్చిమ గోదావరిలో 524 కేసులు నమోదయ్యాయి.కాగా, ఏపీలో మునుపటితో పోలిస్తే కరోనా విజృంభణ చాలావరకూ తగ్గినప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.మరోవైపు మరణాల సంఖ్య కూడా గతంతో పోలిస్తే భారీగానే తగ్గాయి.