రక్షణ రంగంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ట్యాంక్ విధ్వంసక క్షిపణి నాగ్ చివరి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాజస్థాన్లోని పోఖ్రాన్ రేంజ్ నుంచి నాగ్ మిసైల్ క్యారియర్ (ఎన్ఏఎమ్ఐసీఏ) ద్వారా దీనిని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్డీవో) వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక నాగ్ క్షిపణులు ఉత్పత్తి దశకు చేరుకున్నట్లయింది.
పోఖ్రాన్లో విజయవంతంగా మరో నాగ్ పరీక్ష

Related tags :