* మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు నవంబర్ 24కు వాయిదాపడింది. సీఎంగా ఉన్న సమయంలో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన నేపథ్యంలో ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిలిపి వేయాలంటూ బాబు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు.
* రాజధాని అమరావతి పై పలు దుర్మార్గాలకు పాల్పడిన రాష్ట్రప్రభుత్వం ఆఖరికి అమరావతి దళిత జేఏసీ నేతలను అరెస్టు చేయటం పరాకాష్టకు చేరింది అని అమరావతి బహుజన జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటయ్య, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు మేళం భాగ్య రావు తీవ్రంగా ఖండించారు . శుక్రవారం నాడు విజయవాడలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజధాని అమరావతిని హత్య చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కుట్రలు పన్నిందని, ఒక సామాజిక వర్గం, ఎడారి ,వరదలు, పటుత్వం లేని నేలలు, ఇన్సైడ్ ట్రేడింగ్ వంటి కల్పనా అస్త్రాలను ప్రయోగించిందిని, అవన్నీ అబద్ధాలు అని బహుజనులు తేల్చి చెప్పటంతో , దిక్కుతోచక అమరావతి తో సంబంధం లేని పలు ఇతర ప్రాంతాలకు చెందిన కొద్దిమంది బహుజన కులాల వారిని కూలీలుగా మాట్లాడుకుని మూడు రాజధానులు కావాలంటూ పోటి దీక్షలకు దింపిందని వారు ఆరోపించారు .అమరావతికి భూములు ఇచ్చిన వారు 3 రాజధానులు ఎందుకు కావాలని అంటారని, మూడు రాజధానులు కోరేవారు అమరావతిలో దీక్షలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు .అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత లు సృష్టించి తద్వారా అమరావతి రైతు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఫైడ్ పోటీ దీక్షలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు విమర్శించారు. ఒకవైపు రాజధాని కొరకు భూములు ఇచ్చి, రాజధాని నిర్మాణాలు ఆగిపోయి, కౌలు డబ్బులకు సైతం కోర్టులపై ఆధారపడాల్సి వస్తుందని వారు తెలిపారు. భూములిచ్చిన రైతులను అర్థం చేసుకోవాలని దళిత బహుజన కులాల వారికి హితవు పలికారు .కులాల మధ్య చీలికలు తీసుకురావటం పాలకులకు ఆనవాయితీ అని,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో బహుజన కులాల వారు ఐక్యంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని బాలకోటయ్య, భాగ్య రావు బహుజనులకు గుర్తుచేశారు.
* చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం లోఓ మహిళ సంఘం గ్రూపులో రూ. 3 లక్షలు నిధులు స్వాహా కావడం గ్రూప్ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బి.కొత్తకోట మండలంలోని బీరంగి పంచాయతీకాచిపల్లె గ్రామం కు చెందిన రెండవ గ్రామ సమైక్య లోని జయలక్షి గ్రూప్ లోని నిధులు భారీగా దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది. ఈ గ్రూపు లో మొత్తం రూ.3 లక్షలు కు పైగా సభ్యుల డబ్బులు నుమొదటి లీడర్ సుజాత గత కొంత కాలం గాగ్రూప్ కు సంభందించిన లావా దేవిలు జరుపుతూ మినిట్స్ బుక్స్నందు ఫోర్జరీ రసీదు పెట్టి లక్షల్లోస్వాహా చేసినట్లు గ్రూప్ సభ్యులుగుర్తించి ఆమె పై పోలీసులు కుపిర్యాదు చేయడంతోఆమె పై కేసు నమోదు చేసినట్లుయస్ ఐ సునీల్ కుమార్ తెలిపారు.కాగ ఒకే గ్రూపులో ఇంత పెద్ద మొత్తం లో నిధులు స్వాహా కావడం .. ఈ విషయం లో నిధులు రికవరీ చేయాల్సిన పర్యవేక్షణ అధికారులు .. సమస్య పోలీస్ కేసుల వరకు వెళ్లేంత వరకు ఎందుకు నిర్లక్ష్యం వహించారనే కోటి అనుమానాలు వెంటాడుతున్నాయి. పలువురు పర్యవేక్షణ సిబ్బంది తీరు విమర్శలకు తావిస్తోంది.
* చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కొండయ్య గారి పల్లె,రాత్రి కురిసిన వర్షానికి ఉధృతంగా ప్రవహించిన కొండయ్య గారి పల్లె వాగుఅదితెలియక అర్ధరాత్రి 12 గంటలకు అటుగా వచ్చిన కారు.ఆకారులో నలుగురు ప్రయాణించినట్టు సమాచారంవారిలో భార్య,డ్రైవర్ బయట పడగా.. తండ్రి , కూతురు మరియు కారు గల్లంతుపెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగినట్టువీరు పూతలపట్టు మండలం ఒడ్డు పల్లి గ్రామానికి చెందిన వారిగా సమాచారంరంగంలోకి రెస్క్యూ టీంపూర్తివివరాలు తెలియాల్సి ఉంది.