ఇటీవలే ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రీకరణను పూర్తి చేసిన కథానాయిక లావణ్య త్రిపాఠి…..ఇప్పుడు మరో చిత్రం కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం కార్తికేయకు జోడీగా ఆమె ‘చావు కబురు చల్లగా’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కరోనా-లాక్‌డౌన్ పరిస్థితులతో ఆగిన ఈ చిత్రం తాజాగా తిరిగి ప్రారంభమైంది. సెట్స్‌లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ కొనసాగిస్తున్నట్లు చిత్ర బృందం ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఈ వీడియోలో కార్తికేయ, లావణ్య మాస్క్‌లతో సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం చూపించారు. ఈ వీడియోను లావణ్య ట్విటర్‌లో షేర్ చేస్తూ……‘‘సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చివరకు ఇలా’’ అని సెట్స్‌లోకి అడుగుపెట్టడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత షెడ్యూల్‌లో భాగంగా కార్తికేయ, లావణ్య, మురళీ శర్మ తదితర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
చావు కబురు చల్లగా
Related tags :