ఎన్నారై టి.ఆర్.యస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మరియు రత్నాకర్ కడుదుల నాయకత్వం లోని బృందం దుబ్బాక టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గారి గెలుపుకోసం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
మంత్రి హరీష్ రావు గారి సూచన సలహా మేరకు నియోజకవర్గం లోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ టి.ఆర్.యస్ హయాం లో దుబ్బాకలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు తెలిపారు.
దూబాక ప్రజలంతా టి.ఆర్.యస్ వైపే ఉన్నారని, ఎక్కడికి వెళ్లినా ప్రతీ ఒక్కరు ఒక టి.ఆర్.యస్ కార్యకర్తల లాగ కెసిఆర్ గారు చేస్తున్న అభివృద్ధి గురించి, గ్రామాల్లో వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి లెక్కలతో సహా వివరిస్తున్నారని, లక్ష మెజారిటీ తో సోలిపేట సుజాత గారిని గెలిపించుకొని రామ లింగా రెడ్డి ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని ప్రజలు చెప్తున్నారని ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు తెలిపారు.
దుబ్బాక టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గారికి లక్ష మెజారిటే లక్ష్యంగా పని చేస్తున్నామని, తప్పకుండా ప్రతి పక్షాల డిపాజిట్ గల్లంతై టి.ఆర్.యస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలుస్తుందని ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు తెలిపారు.
ఈ ప్రచారం లో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల, రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, శ్రీనివాస్ వల్లాల మరియు స్థానిక నాయకులు బాలకృష్ణ పొగాకు, రాజేష్ భండారి తదితరులు పాల్గొన్నారు.