NRI-NRT

మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ

Malaysia Telangana Association MYTA Batukamma 2020-మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యములొ బతుకమ్మ వేడుకలు
– బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..కరోనా పోవాలె ఉయ్యాలో
– అంతర్జాల వేదికగా బతుకమ్మ సంబరాలు
– పలువురి ప్రశంసలను అందుకున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యములొ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ వేడుకలు ఈ సంవత్సరం వినూత్నం గా జరిగాయి. ఈ సంవత్సరం ప్రపంచ దేశాలలో కరోనా వ్యాప్తి విస్తృతంగా వున్న నేపథ్యంలో ఇ సారి అంతర్జాల వేదికగా బతుకమ్మ సంబరాలు జరిగాయి, ఇ పరిస్థితులను అనుకూలంగా మలచుకొని ప్రపంచ దేశాలలో వున్నా సంఘాలలోని ప్రవాసి తెలంగాణ ఆడపడుచులతో కలిసి ఈసారి బతుకమ్మ పండుగను జరుపుకోవడం విశేషం .ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా తెలంగాణ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరమళ్ళ ప్రకాష్ రావు గారు, హాస్య నటుడు మాజీ మంత్రి శ్రీ బాబు మోహన్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ బాల కిషన్ గారు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్ పర్సన్ విమల గారు, తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి గారు, మలేషియా తెలుగు పునాది ప్రెసిడెంట్ దాతో కాంతారావు గారు పలువురు తెలంగాణ ప్రముఖులు వర్చ్యువల్ వేదికగా ఈ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు.ఎమ్మెల్సీ మరియు తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కవిత గారు వీడియో మెసేజ్ ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కవిత గారు మాట్లాడుతూ 2016 లో మలేషియా వచ్చినపుడు మైట కమిటీ సభ్యులను పర్సనల్ గా కలిసిన విషయాని ఆమె గుర్తుచేశారు. మై ట తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల తో పాటుగా 2016 లో మై ట చెప్పినట్లుగానే తెలంగాణ ప్రవాసీ కార్మికులకు ప్రత్యేక మిగ్రంట్ వింగ్ ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చిన మలేసియా తెలంగాణా అసోసియేషన్ ముందుండి వారికీ సహాయ సహకారాలను అందిస్తుందని గుర్తుచేస్తూ మైట కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సేవలు మునుముందు ఇలాగే కొనసాగాలని ఆమె కోరారు. అలాగే బతుకమ్మ ప్రత్యేకతను వివరించారు.ప్రకాష్ గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు, కరోనా వ్యాప్తి విస్తృతంగా వున్నప్పటికి , ఇ పరిస్థితులను అనుకూలంగా మలచుకొని ప్రపంచ దేశాలలో వున్నా తెలంగాణ సంఘాల సభ్యులతో బతుకమ్మ జరుపుకోవడం ఆనందం గా ఉందని అన్నారు. ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను ఆయన అభినందించారు.బాబు మోహన్ గారు అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు అలాగే మై ట సభ్యులతో ముచ్చటించి అతని అనుభవాలను పంచుకున్నారు అలాగే విదేశాలలో ఉండి కూడా మన తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ నలుమూలల వ్యాప్తి చేస్తున్నందుకు గాను మైట సభ్యులను అభినందించారు.అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య స్థాపకురాలు శ్రీమతి విమలక్క గారు ఈ వేడుకలో బతుకమ్మ జానపదాలతో కార్యక్రమాన్ని రక్తికట్టించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మరో అతిథి శ్రీ దాతో కాంతారావు గారు గతంలో వారు మైటాతో జరుపుకున్న వేడుకలను గుర్తుచేసుకొని ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారుఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్ , జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్,ట్రేసరర్ మారుతీ జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ,కృష్ణ వర్మ,కిరణ్ గాజంగి,హరి ప్రసాద్,వివేక్,రాములు,సుందర్,కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత ,యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ – కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్ , రంజిత్ , సంతోష్ , ఓం ప్రకాష్, అనూష ,దివ్య , సాహితి , సాయిచరని, ఇందు,రోజా ,శ్రీలత . మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Malaysia Telangana Association MYTA Batukamma 2020-మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ
Malaysia Telangana Association MYTA Batukamma 2020-మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ
Malaysia Telangana Association MYTA Batukamma 2020-మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ