కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది దసరా కాస్త కళతప్పింది. ఎప్పుడూ ఉండే సందడి కనిపించడంలేదు. అయితే, ఎలాగోలా సొంతూరుకు వెళ్లైనా.. పండగ జరుపుకుందామని అనుకుంటున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి. మామూలుగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నప్పుడే.. పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మాములుగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో.. ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. దసరా నేపథ్యంలో ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఛార్జీల పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. బెజవాడ నుంచి హైద్రాబాద్‌కి వెయ్యి నుంచి 1,200 వరకు వసూలు చేస్తున్నారు.
బెజవాడ-హైదరాబాద్ మధ్య టికెట్ ధర ₹1200
Related tags :