‘రక్త చరిత్ర’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై… ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే. భారత చిత్రాల్లోనే కాకుండా పలు ఇంగ్లిషు ప్రాజెక్టుల్లోనూ ఆమె నటించారు. కేవలం వీసా కోసం మాత్రమే వివాహం చేసుకున్నానని చెప్పి, ఆమె తాజాగా అందర్నీ ఆశ్చర్యపరిచారు. 2012లో రాధిక బ్రిటిష్ మ్యుజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను మనువాడారు. ఆ తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ.. సినిమా షూటింగ్‌ల కోసం ఎక్కువ రోజులు భారత్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం లండన్‌లో భర్తతో కలిసి జీవిస్తున్నారు. రాధిక తాజాగా తన పెళ్లి గురించి ఇంటర్వ్యూలో ముచ్చటించారు. ‘మీకు ఎప్పుడు పెళ్లైంది?’ అని ప్రశ్నించగా.. ‘పెళ్లి (విదేశాల్లో ఉన్న వ్యక్తితో) జరిగితే వీసా అతి సులభంగా లభిస్తుందని తెలుసుకున్న తర్వాత చేసుకున్నా. నా వరకు జీవితానికి హద్దులనేవి లేవు. నేను వివాహాన్ని నమ్మే వ్యక్తిని కాదు. ఈ వ్యవస్థపై నాకు నమ్మకం లేదు. వీసా పొందడం సమస్యగా మారిన తర్వాత కేవలం దాని కోసమే పెళ్లి చేసుకున్నా. అందులోనూ మేమిద్దరం కలిసి జీవించాలి అనుకున్నాం’ అని చెప్పారు.
వివాహం నమ్మను. వీసా కోసమే పెళ్లి.
Related tags :