Movies

ట్రాన్స్‌జెండర్‌గా వాణీ

ట్రాన్స్‌జెండర్‌గా వాణీ

బాలీవుడ్‌ హీరోయిన్ వాణీకపూర్‌ దక్షిణాదిన నటించిన చిత్రం ‘ఆహా కల్యాణం’. నాని హీరోగా నటించారు. ఆ తర్వాత ఈ అమ్మడు మరే దక్షిణాది చిత్రంలోనూ నటించలేదు. బాలీవుడ్‌లో మాత్రం నటిస్తూనే ఉంది. కాగా.. తాజా సమాచారం మేరకు ఈ అమ్మడు చండీగఢ్‌ కరే అశిఖీ అనే సినిమాలో ఓ ఛాలెజింగ్‌ పాత్ర పోషించనుందట. అది కూడా ఓ ట్రాన్స్‌జెండర్ పాత్ర కావడం విశేషం. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా హీరోయిన్‌. తను ఓ ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడతాడట. ఆమె వాణీకపూర్‌ అని టాక్‌. ఇప్పటి వరకు మనం హీరోలు ట్రాన్స్‌జెండర్స్‌గా నటించడం చూశాం కానీ.. ఓ హీరోయిన్‌ అలాంటి పాత్ర చేయడం చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు.