Health

మీకు ఎముకలు బలహీనమా? మీరు చిన్నప్పుడు పరుగెత్తలేదు.

మీకు ఎముకలు బలహీనమా? మీరు చిన్నప్పుడు పరుగెత్తలేదు.

చిన్నవయసులో వ్యాయామం ఎక్కువగా చేసినవాళ్లలో పెద్దయ్యాక ఎముక బలం బాగుంటుందనీ దాంతో ఆస్టియోపొరోసిస్‌ రాకుండా ఉంటుందని బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు. అది కూడా పన్నెండేళ్ల వయసు నుంచీ ఆటలాడటం, పరుగులెత్తడం ఎక్కువగా చేసేవాళ్లకి పాతిక సంవత్సరాలు వచ్చేసరికి ఎముకల్లో పటుత్వం పెరుగుతుందట. వాళ్లతో పోలిస్తే ఆటలు ఆడకుండా ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాళ్లలో తరవాతి కాలంలో ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉందట. దీనికోసం వీళ్లు 12, 14, 16, 25 సంవత్సరాల వరకూ ఎంపిక చేసి యాక్సెలోమీటర్ల ద్వారా వాళ్ల శరీర కదలికల్ని అనుక్షణం గుర్తిస్తూ వచ్చారట. వాటి ఆధారంగా యుక్త వయసు కన్నా కౌమార్యంలో శారీరక వ్యాయామం చేసిన వాళ్లలోనే తరవాతి కాలంలో ఎముకలు దృఢంగా ఉన్నట్లు గుర్తించారు. అది కూడా పరుగులు తీసే ఆటలు ఆడేవాళ్లలో మరీ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఆడ, మగ తేడా లేకుండా ఆ వయసులో పిల్లలకు వ్యాయామం, ఆటలు తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు