* ఏపీలో కొత్తగా 2,997 కరోనా కేసులుఅమరావతి: ఏపీలో కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి.24 గంటల వ్యవధిలో 67,419 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి.దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,07,023కి చేరింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 21 మంది మృతిచెందారు.చిత్తూరులో ఐదుగురు, కడప ముగ్గురు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,587కి చేరింది.గత 24 గంటల వ్యవధిలో 3,585 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 30,860 యాక్టివ్ కేసులున్నాయి.రాష్ట్రంలో ఇప్పటివరకు 75,70,352 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
* భారత్‌లో గడచిన 24 గంటల్లో 50,129 పాజిటివ్ కేసులు నమోదు.578 మంది మృతి.. 62,077మంది రికవరీ..78,64,811కు చేరిన పాజిటివ్ కేసులు, ఇప్పటి వరకు 1,18,534 మంది మృతి..70,78,123 మంది రికవరీ, ప్రస్తుతం 6,68,154 యాక్టివ్ కేసులు.
* కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ఇప్పటి వరకు ఎన్నడూలేని విధంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 83 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. జులై నెల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటికే అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 85 లక్షలకు చేరుకోగా.. వీరిలో 2 లక్షల 24వేల మంది మృత్యవాతపడ్డారు. ఇక జులై 16వ తేదీన అత్యధికంగా ఒక్కరోజే 77,632 కేసులు నమోదయ్యాయి. మూడు నెలల తర్వాత తాజాగా ఒకరోజు వ్యవధిలోనే రికార్డుస్థాయిలో 83,757 కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా కనెక్టికట్ రాష్ట్రంతోపాటు సమీప ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.